ETV Bharat / state

అసిస్టెంట్​పై అత్యాచారం ఆరోపణలు - గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్ - JANI MASTER ARRESTED TODAY - JANI MASTER ARRESTED TODAY

Jani Master Arrest News : అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో నిందితుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్​ను పోలీసులు అరెస్టు చేశారు. గోవాకు వెళ్లిన రాజేంద్రనగర్ ఎస్​ఓటీ పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకువస్తున్నారు.

Jani Master Arrest News
Jani Master Arrest News (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2024, 11:23 AM IST

Updated : Sep 19, 2024, 5:11 PM IST

Jani Master Arrested : ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ను పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. గోవాలోని లాడ్జిలో అదుపులోకి తీసుకున్న రాజేంద్రనగర్ ఎస్‌వోటీ, నార్సింగి పోలీసులు అక్కడి కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్‌ తీసుకొస్తున్నారు. అనంతరం నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు, అతనిపై పొక్సో యాక్ట్ సైతం నమోదు చేశారు. ఈ కేసు విషయమై నార్సింగి పోలీసులు ప్రెస్​నోట్​ రిలీజ్​ చేశారు.

Jani Master Arrest News
జానీ మాస్టర్​ కేసు ప్రెస్​నోట్ (ETV Bharat)

బాధితురాలి వాంగ్మూలం నమోదు : అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో జానీమాస్టర్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. జానీ మాస్టర్‌ తనపై 2019లో అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నార్సింగి పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. యువతి ఫిర్యాదు ఆధారంగా తొలుత అత్యాచారం, నేరపూరిత బెదిరింపు, దాడి తదితర మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

బాధితురాలిపై అఘాయిత్యం జరిగినప్పుడు మైనర్‌ అని తేలడంతో పోక్సో చట్టం చేర్చారు. ఈ వ్యవహారం తెలుగురాష్ట్రాల్లో చర్చనీయాంశం కావడంతో నార్సింగి పోలీసులు పక్కాగా ఆధారాలు సేకరిస్తున్నారు. వాంగ్మూలం సేకరణ, దర్యాప్తు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. జానీ మాస్టర్‌ లద్దాఖ్, నెల్లూరులో సినిమా చిత్రీకరణలో ఉన్నారని, అరెస్టు చేసేందుకు నార్సింగి పోలీసులు ప్రత్యేక బృందాలతో వెళ్లినట్లు ప్రచారం బుధవారం జరిగినా పోలీసులు కొట్టేపారేశారు. ఎట్టకేలకు గోవాలో అరెస్టు చేశారు.

కాగా ఈ కేసులో నార్సింగి పోలీసులు బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. వైద్య పరీక్షలు చేయించినట్లు తెలుస్తోంది. భరోసా కేంద్రంలోని నిపుణుల ఆధ్వర్యంలో యువతి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా యువతి ఔట్‌డోర్‌ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు తనపై జరిగిన లైంగిక దాడి జరిగిన తీరును వివరించినట్లు తెలిసింది. అతడి చర్యల్ని అంగీకరించకపోతే భౌతిక దాడి చేస్తూ సినిమా అవకాశాలు రాకుండా చూస్తామని బెదిరించేవాడని వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది.

2019 నుంచి తనపై దాష్టీకం కొనసాగించారని, నిందితుడి బెదిరింపులకు భయపడి ఈ విషయాన్ని ఎవరితో పంచుకోలేదని వాపోయినట్లు సమాచారం. తొలుత సినీ అవకాశాల పేరుతో చేరదీసినట్లు నటించి, ఆ తర్వాత వికృత రూపం రూపించారని, ఎదురుతిరిగిన తర్వాత తనకు అవకాశాల రాకుండా వేధించడం, ప్రాజెక్టుల్ని అర్ధాంతరంగా వదిలేసేలా ఒత్తిడి చేసేవారని వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.

జానీ మాస్టర్​ అరెస్ట్​పై స్పందించని భార్య : కొరియోగ్రాఫర్​ జానీ మాస్టర్​ భార్య సుమలత మధ్యాహ్నం నార్సింగి పోలీస్​స్టేషన్​కు వచ్చారు. ఈ సమయంలో జానీ మాస్టర్​పై కేసు, అరెస్ట్​ తదితర విషయాలపై మీడియా ప్రతినిధులు యత్నించారు. కానీ ఆమె స్పందించలేదు. ఓ ఫేక్​ కాల్​ వచ్చిందని ఆ విషయంపై ఫిర్యాదు చేసేందుకు పీఎస్​కు వచ్చినట్లు తెలిపారు.

లైంగిక వేధింపుల ఆరోపణలు - జానీ మాస్టర్​కు తెలుగు ఫిలిం ఛాంబర్ షాక్ - JANI MASTER CONTROVERSY

'జానీ మాస్టర్ నన్ను లైంగికంగా వేధించారు - ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది' - RAPE CASE AGAINST JANI MASTER

Last Updated : Sep 19, 2024, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.