Film Celebrities Pay Tribute to Ramoji Rao: రామోజీరావు మరణవార్త విన్న సినీలోకం శోకసంద్రంలో మునిగింది. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌సిటీలో ఆయన పార్థివదేహం వద్ద చేరి పలువురు సినీ ప్రముఖులు అంజలి ఘటించారు. సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్, జగతిపతి బాబు, తరుణ్, రాజేంద్రప్రసాద్, కల్యాణ్ రామ్, శివాజీ, సాయి కుమార్, ఆది తదితర నటులు రామోజీ పార్థివదేహానికి నివాళులర్పించారు.
Mahesh Babu Tweet on Ramoji Rao : మరికొందరు ప్రముఖ నటులు ట్వీట్ చేస్తూ రామోజీరావుకు నివాళులర్పించారు. రామోజీరావు అస్తమయం పట్ల నటుడు మహేశ్‌బాబు సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సినిమాపై ఆయనకున్న అభిరుచికి రామోజీ ఫిల్మ్‌సిటీ నిదర్శనమని గుర్తు చేస్తూ ఆయన అధికార ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేస్తూ నివాళులర్పించారు.
రామోజీ ఇచ్చిన స్పూర్తితోనే ఈనాడు ఉద్యోగి నుంచి ఎంపీ స్థాయికి ఎదిగాను- ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
NTR Tweet on Ramoji Rao : రామోజీ రావు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు ఉంటారని ఎన్టీఆర్ అన్నారు. మీడియా సామ్రాజ్యాధినేత, భారతీయ సినిమా దిగ్గజం అయినటు వంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరమని పేర్కొన్నారు. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో తనని తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేనని గుర్తు చేసుకున్నారు. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Sai Kumar Speech About Ramoji Rao : రామోజీరావు లేరనే వార్త చాలా బాధాకరంగా ఉందని సినీ నటుడు సాయి కుమార్ అన్నారు. తన కుటుంబంలో మూడు తరాలతోనే ఆయనతో మంచి సంబంధాలు ఉండేవని గుర్తు చేసుకున్నారు. తాము ఎప్పుడు కలిసిన జీవితం గురించి చెప్పేవారని వివరించారు. కోట్ల మందికి ఆయన మార్గదర్శకుడు అని కొనియాడారు. ఈటీవీలో ప్రసారమైన వావ్ షోకు ఎంతో ప్రోత్సాహం చేశారని తెలిపారు.