ETV Bharat / state

వాహనదారులకు అలర్ట్ - ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు పెంపు - TOLL CHARGES HIKE 2024

Toll Charges Increase 2024 : ఇవాళ్టి నుంచి అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) టోల్‌ ఛార్జీలను 5 శాతం పెంచుతున్నట్లు ఐఆర్‌బీ సంస్థ ప్రకటించింది. దీంతో వాహనదారులకు అదనపు భారం పడనుంది. వివిధ రకాల వాహనాలను ఆరు కేటగిరీలుగా విభజించి ఛార్జీలు నిర్ణయించారు. కొత్త ధరల అవగాహన కోసం టోల్​ప్లాజాల వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. మరి మీ వాహనానికి ఎంత ఛార్జీ పెరిగిందో ఓసారి చూద్దామా?

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 3, 2024, 11:47 AM IST

toll_charges_increase_2024
toll_charges_increase_2024 (ETV Bharat)

Toll Charges Increased Five Percent in Hyderabad : ఆర్థిక సంవత్సరం 2024-25కు సంబంధించి అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) టోల్‌ ఛార్జీలను సగటున 5 శాతం పెంచుతున్నట్లు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ సంస్థ ఆదివారం ప్రకటించింది. హెచ్​ఎండీఏ పరిధిలోని హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ లిమిటెడ్​(హెచ్​జీసీఎల్​) నిర్వహణలో ఉండే ఓఆర్​ఆర్​ను ఐఆర్​బీ సంస్థ గత సంవత్సరం 30 ఏళ్లకు లీజు తీసుకుంది. నిబంధనల ప్రకారం ఏటా 5 శాతం వరకు టోల్​ఛార్జీలను పెంచుకునే వెసులుబాటు సంస్థకు కల్పించింది. ఇందులో భాగంగా టోల్​ ధరలను పెంచింది.

New Toll Charges List 2024 : ప్రస్తుతం పెరిగిన టోల్​ఛార్జ్​లు ఇవాళ్టి (జూన్ 3వ తేదీ) నుంచి అమల్లోకి వచ్చాయి. వివిధ రకాల వాహనాలను ఆరు కేటగిరీలుగా నిర్వాహకులు విభజించి ఛార్జీలను నిర్ణయించారు. వాహనదారులకు ధరలపై ఆందోళన లేకుండా టోల్​ప్లాజాల వద్ద బోర్డులను ఏర్పాటు చేసినట్టు నిర్వహణ సంస్థ తెలిపింది. కొత్త టోల్‌ రేట్లు, నెలవారీ, రోజువారీ పాసుల కోసం హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌ https://www.hmda.gov.in/ ను సంప్రదించాలని సూచించింది.

వాహనదారులకు గుడ్ న్యూస్​ - సార్వత్రిక ఎన్నికల తర్వాతే కొత్త టోల్‌ ఛార్జీలు! - Toll Tax Relief

Toll Taxes For Vehicles in Hyderabad : ప్రతి సంవత్సరం టోల్​ఛార్జీలు ఏప్రిల్​ 1వ తేదీన పెంచుతుంటారు. ఈ ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టోల్​ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దేశంలో జూన్​ 1న చివరి దశ పోలింగ్​ ముగియడంతో టోల్​ ధరలు పెంచుకునేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం పెంచిన ధరలు 2025 మార్చి 31 వరకు వర్తిస్తాయని నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ టోల్​ ఛార్జీలు దేశవ్యాప్తంగా కూడా పెరిగాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

కొత్తగా పెంచిన టోల్​ఛార్జీల వివరాలు :

క్రమ సంఖ్య వాహనం రకం ప్రతి కిలో మీటర్​కి రేటు (రూపాయల్లో)
1

కారు, జీపు, వ్యాను, ఎల్​ఎంవీ,

ఎస్​యూవీ, ఎంపీ

2.34
2 ఎల్​సీవీ, మినీ బస్సు 3.77
3 బస్సు, 2 యాక్సిల్​ ట్రక్కు 6.69
4 3 యాక్సిల్​ వాణిజ్య వాహనం 8.63
5

భారీ నిర్మాణ యంత్రాలు,

ఎర్త్​ మూవీంగ్​ ఎక్విప్​మెంట్​,

4, 5, 6 యాక్సిల్​ ట్రక్కులు

12.40
6

భారీ వాహనాలు

(ఏడు అంతకంటే ఎక్కువ యాక్సిల్స్)

15.09

టోల్​గేట్ ఛార్జీలు, ట్రాఫిక్ తప్పించుకోవాలా? సంక్రాంతి రిటర్న్ జర్నీలో ఇలా చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.