Tobacco Auction Start in Nellore District : నెల్లూరులోని డీసీ పల్లి, కలిగిరిలో కేంద్రాల్లో పొగాకు కొనుగొళ్లు ప్రారంభమయ్యాయి. ఇందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. తొలి రోజు 18 బేళ్లను పొగాకు వేలం కేంద్రానికి రైతులు తీసుకొచ్చారు. అధికారులు కేజీ రూ.240 నుంచి కొనుగోలు ప్రారంభించారు. డిసెంబరులో మిగ్జాం తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు అప్పుడే నాటిన మొక్కలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత చినుకు జాడ లేకపోవడంతో సాగుదారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పెట్టుబడులు సైతం అమాంతం పెరిగాయి. ఈ మొత్తం పరిస్థితుల నేపథ్యంలో ధరలపై గంపెడాశలు పెట్టుకుంటే చివరకు రైతులకు నిరాశే మిగిలింది.
నీరిస్తామన్నారని వరి వేసిన అన్నదాతలు- పంట కోతకొచ్చే వేళ చేతులెత్తిన అధికారులు
డీసీపల్లి, కలిగిరి మండలాలలో రైతుల పొగాకు సాగు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. వారికి పొగాకు పంటే జీవనాధారం. ఇక్కడ పండించిన పొగాకు అంతర్జీతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. గత ఏడాది పొగాకు మంచి లాభాలు వచ్చాయని ఈసారి కూడా రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ధరలు ఆశాజనకంగా ఉంటాయని ఆశిస్తే చివరకు నిరాశనే మిగిలిందని రైతులు వాపోతున్నారు. ఎఫ్1 గ్రేడ్ రకానికే రూ.250 ఇస్తే లోగ్రేడ్ గ్రేడింగ్కి ఎంత ఇస్తారని రైతులు అయోమయంలో పడ్డారు. లోగ్రేడ్ పొగాకు ధరలు కూడా బాగా తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
జగన్ కలలు కంటున్నారు - వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం: అమరావతి రైతులు
కందుకూరులోని రెండు వేలం కేంద్రాల్లో గత ఏడాది 24.5 మిలియన్ కిలోల పొగాకు అమ్మకాలు జరగ్గా సరాసరి కిలో రూ.220 పలికిందని రైతులు తెలిపారు. గత పదేళ్లతో పోల్చితే 2022-23 పొగాకు సాగుదారులకు బాగా కలిసొచ్చిందని పేర్కొన్నారు. ఎఫ్1 రకం కిలో రూ.288 , లోగ్రేడ్ కిలో రూ.190 వచ్చిందని రైతులు తెలిపారు. ఈ ఏడాది పొగాకు ధరలు అత్యంత దారుణంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగ్జాం తుపాను కారణంగా ఒకవైపు నష్టపోతే, ఆ తర్వాత వర్షం రాక పంటను పండించడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. పంట పెట్టుబడి కూడా పెరిగిందని తెలిపారు. ఎఫ్1 రకం కిలో రూ.300 ఇస్తే గిట్టుబాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్యుత్ లో వోల్టేజీతో ఎండుతున్న పంటలు- అన్నదాతకు తలకుమించిన పెట్టుబడులు
సరైనా గిట్టుబాటు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ధరలు ఆశాజనంగానే ఉన్నాయని పొగాకు వేలం బోర్డు ఈడీ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఎఫ్1 పొగాకు కేజీ సరాసరి రూ.240 ధర పలుకుతుందని, రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ ధర రైతులకు గిట్టుబాటు అవుతుందని అన్నారు. ఈ సంవత్సరం పొగాకు చాలా క్వాలిటీగా ఉందని, దీంతో అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఏర్పడుతుందని వెల్లడించారు.