TNSF Protest at TG Intermediate Board in Hyderabad : మధ్యతరగతి విద్యార్థి ఉన్నత చదువులు చదవాలంటే అనేక సమస్యల్లో ఆర్థిక ఇబ్బంది ఒకటని ప్రైవేట్ కళాశాలలను కోచింగ్ పేరుతో మరింత సమస్యలు సృష్టిస్తున్నారని తెలంగాణ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్ఎస్ఎఫ్) ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటర్మీడియట్ విద్యారంగ సమస్యలపై హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర నిరసన తెలిపింది. వెంటనే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
TNSF Demands on Intermediate Education : జూనియర్ కళాశాలలో అకాడమీలు(కోచింగ్ సెంటర్లు)గా మార్చి ఇంటర్ బోర్ఢు నిబంధనలకు విరుద్ధంగా ఐఐటీ, నీట్, జేఈఈ కోచింగ్ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని టీఎన్ఎస్ఎఫ్ పేర్కొంది. వాటిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాంట్రగడ్డ ప్రసన్న కోరారు. విద్యను వ్యాపారం చేస్తూ లక్షల్లో ఫీజు దండుకుంటున్నారని, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆర్థిక దోపిడికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇష్టానుసారంగా కోచింగ్‌ల పేరుతో విద్యార్థులను అయోమయానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇంటర్మీడియట్ బోర్డు పట్టించుకోక పోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ ఈడు పిల్లల్ని స్కూల్‌కు రప్పించడమే లక్ష్యంగా - జూన్ 3 నుంచి బడిబాట - BADI BATA IN TELANGANA 2024
ఇంటర్ విద్యను వ్యాపారంగా మలుచుకుని పుస్తకాలు, స్టేషనరీ, దుస్తుల పేరుతో వేలాది రూపాయలు ప్రైవేట్ సంస్థలు దోచుకుంటున్నారని ప్రసన్న ఆరోపించారు. ఇప్పిటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యను వ్యాపారం చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలపై తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
"ఇంటర్మీడియట్ కళాశాలల్లో జరుగుతున్న అవకతవకల మీద టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టాం. అనేక రకాల కోచింగ్‌ల పేరుతో దళారి వ్యవస్థను ఏర్పాటు చేసి లక్షల్లో రూపాయలను దండుకుంటున్నారు. వారిపై చర్యలు తీసుకొనేవారు లేకపోవడం బాధాకరం. జూనియర్ కళాశాల్లో సిబ్బంది పెంచడంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తున్నాం." - కాంట్రగడ్డ ప్రసన్న, టీడీపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు