ETV Bharat / state

విమానాల్లో ప్రయాణం - స్టార్ హోటళ్లలో విడిది - ఏం చేస్తారో తెలిస్తే షాక్​ - TIRUPATI POLICE ARREST THIEF

విమానాల్లో ప్రయాణం చేస్తూ, స్టార్‌ హెటల్స్‌లో ఉంటూ రెక్కీ నిర్వహించి దోపిడీలు - ఎట్టకేలకు అరెస్టు చేసిన తిరుపతి పోలీసులు

Thief Arrest
Thief Arrest (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2024, 1:49 PM IST

Updated : Nov 23, 2024, 2:50 PM IST

Tirupati Police Arrest Thief : చోరీ డబ్బులతో విమానాల్లో ప్రయాణిస్తాడు. స్టార్‌ హోటళ్లలో విడిది చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతాడు. 16 సంవత్సరాలకే దొంగతనాలు మొదలు పెట్టి అంతర్రాష్ట్ర స్థాయిలో 18 కేసుల్లో నిందితుడైన విలాసాల దొంగను తిరుపతి క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి సీసీఎస్‌ పోలీసు స్టేషన్‌లో అదనపు ఎస్పీ నాగభూషణ రావు, డీఎస్పీ రమణ కుమార్‌లు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఈ నెల 15న మధ్యాహ్నం తిరుపతి ఎయిర్‌ బైపాస్‌ రోడ్డులో తాళం వేసి ఉన్న వెస్ట్రన్‌ యూనియన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ కార్యాలయంలోకి ఓ వ్యక్తి చొరబడి క్యాష్‌ కౌంటర్‌లోని రూ.8 లక్షలు చోరీ చేశాడని తెలిపారు. కేసు నమోదు చేసిన సీఐలు ప్రకాష్‌ కుమార్, చిన్న పెద్దయ్య, ఎస్‌ఐ శుభన్‌ నాయక్‌తో పాటు సిబ్బంది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారని అన్నారు సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా పెట్టగా ఈ నెల 22న శ్రీసాయి నిర్మలా కల్యాణ మండపం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని సోమరాజపల్లికి చెందిన గురువిళ్ల అప్పల నాయుడు (29)ను అదుపులోకి తీసుకున్నారని, అలాగే రూ.6 లక్షల నగదు, స్క్రూడ్రైవర్‌ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

ఆరు కేసుల్లో నిందితుడు -అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులు - చివరకు ఏం జరిగిందంటే!

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం గుడితి గ్రామానికి చెందిన అప్పల నాయుడు కొన్నేళ్ల కిందట ప్రకాశం జిల్లాలో స్థిరపడ్డారని, వెస్ట్రన్‌ యూనియన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ కార్యాలయంలో చోరీ చేసినట్లు అంగీకరించాడని పేర్కొన్నారు. సింగరాయకొండ, కందుకూరు, ఒంగోలు, టంగుటూరు, మువ్వలరాణిపాళెం, గాజువాక, విశాఖపట్నం అరిలోవ, ద్వారకా పోలీస్‌స్టేషన్లతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఎస్‌ఆర్‌ నగర్‌ పీఎస్‌లోనూ ఇతనిపై కేసులు ఉన్నాయని వెల్లడించారు.

వారం రోజుల్లో రూ.2 లక్షలు ఖర్చు : నిందితుడు అప్పల నాయుడు గ్లాస్‌ డోర్‌ ఉన్న దుకాణాల కోసం ముందుగా రెక్కీ నిర్వహిస్తాడు. మధ్యాహ్నం భోజన సమయంలో యజమానులు దుకాణాలు మూసి వెళ్లగానే దగ్గర ఉన్న నకిలీ తాళాలు, స్క్రూ డ్రైవర్‌ సాయంతో వాటిని తెరిచి చోరీ చేస్తాడు. ఇలా విశాఖలోని అరిలోవ పీఎస్‌ పరిధిలో చేసిన దొంగతనం కేసులో జైలుకు వెళ్లారు. ఈ నెల 11న బయటకు వచ్చాడు. అక్కడి నుంచి విమానంలో తిరుపతికి వచ్చి తిరుచానూరు రోడ్డులోని స్టార్‌ హోటల్‌లో దిగాడు. 4 రోజులు రెక్కీ నిర్వహించి 15వ తేదీ చోరీకి పాల్పడ్డాడు. వారం రోజుల్లో రూ.2 లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

గతంలో ట్రాన్సుపోర్టు అధికారి ఇప్పుడు దొంగ - ₹40లక్షలు చోరీ 42 గంటల్లోపే!

Last Updated : Nov 23, 2024, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.