Tirumala Laddu Sales Increased: గత కొద్ది రోజుల నుంచీ తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉంచారు. తిరుమల లడ్డూ విక్రయాలు పెరగడమే దీనికి నిదర్శనం. తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయాలు భారీగా పెరిగాయి. వారం రోజుల్లో 23 లక్షల 13 వేల 202 లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుమలలో గత ప్రభుత్వ చేసిన తప్పిదాలను సరి చేసింది. శ్రీవారి ప్రసాదాలలో కేవలం స్వచ్ఛమైన ఆవు నెయ్యి మాత్రమే వాడేలా కఠిన చర్యలు తీసుకుంది. దీంతో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడకంతో శ్రీవారి లడ్డూలు రుచికరంగా మారాయి. రోజుకు 3.2 లక్షల లడ్డూలను శ్రీవారి భక్తులు కొంటున్నారు.
స్వచ్ఛత, నాణ్యతకు తిరుమల తిరుపతి లడ్డూ పెట్టింది పేరు. భక్తులు ఎంతో పవిత్రంగానూ భావించే తిరుపతి లడ్డూలో కొన్నాళ్లుగా నాణ్యత లోపించిందనేది వాస్తవం అంటున్న భక్తులు, కూటమి ప్రభుత్వం వచ్చాక భోజనంలోనూ గణనీయమై మార్పులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదాల్లో నాణ్యత పెరిగిందని, శ్రీవారి అన్న ప్రసాదం రుచిగా ఉందని చెప్తున్నారు.
అదే విధంగా ఎంతో పవిత్రంగానూ భావించే తిరుపతి లడ్డూలో కొన్నాళ్లుగా నాణ్యత లోపించిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక గణనీయమైన మార్పులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదాల్లో నాణ్యత పెరిగిందని, అన్న ప్రసాదం ఎంతో రుచిగా ఉందని చెప్తున్నారు. అంతే కాకుండా శ్రీవారి ఆలయ క్యూలైనల్లోనూ పరిస్థితి మెరుగుపడిందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.