ETV Bharat / state

తిరుమల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల - ఏ రోజు ఏం చేస్తారంటే? - Tirumala Brahmotsavam 2024 Schedule - TIRUMALA BRAHMOTSAVAM 2024 SCHEDULE

Tirumala Brahmotsavam Schedule: తెలుగువారి ఇష్ట దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సమయం రానే వచ్చేసింది. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు సంబంధించిన షెడ్యూల్​ను టీటీడీ అధికారులు విడుదల చేశారు. ఈ ఉత్సవాల తొమ్మిది రోజులు స్వామివారికి చేసే సేవల వివరాలు ఇలా ఉన్నాయి.

Tirumala_Brahmotsavam_Schedule
Tirumala_Brahmotsavam_Schedule (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 2:05 PM IST

Tirumala Brahmotsavam Schedule: ప్రపంచ ప్రసిద్ధ ఆలయాల్లో తిరుమల ఆలయం ఒకటి. కేవలం మన తెలుగు రాష్ట్రాల నుంచే కాక వివిధ దేశాల నుంచి భక్తులు శ్రీవారి దర్శనార్థం తరలి వస్తుంటారు. ఏడాది పొడవునా ఆలయం గోవింద నామాలతో మార్మోగుతుంది. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే దారులన్నీ తిరుమల వైపే పరుగులు తీస్తాయి. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో వేర్వేరు రథాలపై తిరుమల మాఢ వీధుల్లో తిరిగే స్వామివారిని దర్శించుకుంటే తమ కష్టాలన్నీ తొలగిపోయి అంతులేని అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవుడే తిరుమల శ్రీవారిని సేవించుకునేందుకు ఈ బ్రహ్మోత్సవాలను మొదలుపెట్టినట్లు చెబుతుంటారు. అంతటి విశిష్టత కలిగిన తిరుమల వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది బ్రహ్సోత్సవాలకు సంబంధించిన షెడ్యూల్​ను టీటీడీ విడుదల చేసింది. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల షెడ్యూల్:

  • అక్టోబర్​ 3వ తేదీ గురువారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన

అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం- మొదటిరోజు:

  • మధ్యాహ్నం: 3.30 నుంచి 5.30 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం
  • సాయంత్రం: సుమారు 6 గంటలకు ద్వజారోహణం (ధ్వజారోహణం)
  • రాత్రి: 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం

అక్టోబర్ 5వ తేదీ శనివారం- రెండోరోజు:

  • ఉదయం: 8 గంటల నుంచి 10 గంటల వరకు చిన శేష వాహనం
  • మధ్యాహ్నం: ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం(ఉత్సవర్లకు అభిషేకం)
  • రాత్రి: 7 గంటల నుంచి 9 గంటల వరకు హంస వాహనం

అక్టోబర్ 6వ తేదీ ఆదివారం- మూడోరోజు:

  • ఉదయం: 8 గంటల నుంచి 10 గంటల వరకు సింహవాహనం
  • మధ్యాహ్నం: ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం (ఉత్సవర్లకు అభిషేకం)
  • రాత్రి: 7 గంటల నుంచి 9 గంటల వరకు ముత్యాల పల్లకీ వాహనం (ముత్యపు పందిరి వాహనం)

అక్టోబర్ 7వ తేదీ సోమవారం- నాల్గవ రోజు:

  • ఉదయం: 8 గంటల నుంచి 10 గంటల వరకు కల్పవృక్ష వాహనం
  • సాయంత్రం: 7 గంటల నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనం

అక్టోబర్ 7వ తేదీ మంగళవారం- ఐదో రోజు:

  • ఉదయం: 8 గంటల నుంచి 10 గంటల వరకు మోహినీ అవతారం
  • రాత్రి: సుమారు 7 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం

అక్టోబర్ 9వ తేదీ బుధవారం- ఆరో రోజు:

  • ఉదయం: 8 నుంచి 10 గంటల వరకు హనుమంత వాహనం
  • సాయంత్రం: 4 నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవం (స్వర్ణ రథం)
  • రాత్రి: 7 గంటల నుంచి 9 గంటల వరకు గజవాహనం

అక్టోబర్ 10వ తేదీ గురువారం- ఏడో రోజు:

  • ఉదయం: 8 గంటల నుంచి 10 గంటల వరకు సూర్య ప్రభ వాహనం

  • రాత్రి: 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం

అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం- ఎనిమిదోరోజు:

  • ఉదయం 6 గంటలకు రథోత్సవం (రథం, రథోత్సవం)
  • సాయంత్రం: 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వవాహనం

అక్టోబర్ 12వ తేదీ శుక్రవారం- తొమ్మిదోరోజు:

  • తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు పల్లకీ ఉత్సవం & తిరుచ్చి ఉత్సవం
  • ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నానం

ఈ ఏడాది సాలకట్ల బ్రహ్మోత్సవాలు లేవా?: సాధారణంగా తిరుమల బ్రహ్మోత్సవాలను ఏడాదికి ఒకసారి నిర్వహిస్తారు. అయితే ఏడాదికి అధికమాసం వస్తే మాత్రం రెండుసార్లు నిర్వహిస్తారు. ఇలా రెండుసార్లు వచ్చే బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారు. ఈ ఏడాది అధికమాసం లేదు. కావున ఒకసారి మాత్రమే బ్రహ్మోత్సవాలు నిర్విహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుమలలో తవ్విన కొద్దీ అక్రమాలు - విజిలెన్స్ సోదాలతో ఉక్కిరిబిక్కిరి - Vigilance investigation in Tirumala

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్​ - ఆ రెండు రోజులు వీఐపీ బ్రేక్​ దర్శనాలు రద్దు - దర్శన వేళల్లో మార్పు! - TTD Cancelled VIP Break Darshan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.