Tips For Driving in Foggy Weather Conditions : అసలే చలకాలం బైక్ మీద వెళ్లినా, కారులో వెళ్లినా ఎలాంటి ప్రయాణమైనా విపరీతమైన వణుకు పుట్టిస్తుంది. శీతాకాలం వచ్చేసిందంటేనే తెల్లవారుజామున రహదారులపై పొగమంచు కమ్మేస్తోంది. వాహనాలు నడిపేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు తప్పవని వాహన నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగమంచు కారణంగా ఈ ప్రమాదాలూ జరిగే అవకాశమూ ఉందంటున్నారు. ఒకవేళ పొరపాటున గాయం గానీ అయితే విపరీతమైన మంట పుడుతుందంటున్నారు.
కనుక చలికాలం ప్రయాణాలకు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనికోసం డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలుపుతున్నారు. ఎముకలు కొరికే చలి కాలంలో, దారి కమ్మే పొగమంచు వేళలో డ్రైవింగ్ సాఫీగా సాగిపోయే సూపర్ టిప్స్ ఈ కథనంలో తెలుసుకుందాం.
ఫాగ్ లైట్లు : శీతాకాలం కనుక దారంతా పొగమంచు కమ్ముకుని ఉంటుంది. ముందు ఏ వాహనం వస్తుందో, జంతువు వస్తుందా, మరేదైనా వస్తుందా అనేది పోల్చుకోలేం. కాబట్టి వాహనాలకు ఫాగ్ లైట్లు వాడటం మంచిది. ఇవి పొగమంచులో దారిని మెరుగ్గా కనిపించేలా చేస్తాయి. దీంతో డ్రైవింగ్ సేఫ్‌గా సాగుతుంది.
కారు కోసం ఈ ట్రిక్ : వాతావరణం పొగమంచుతో నిండి ఉన్నప్పుడు కార్లు నడిపే సమయంలో విండీషీల్డ్ వైపర్లు, డీఫ్రాస్టర్లు వాడాలి. వీటి ద్వారా మార్గం చక్కగా కనిపిస్తుంది.
సే నో టూ హైబీమ్ లైట్స్ : పొగమంచులో హైబీమ్ లైట్లు అంత మంచివి కాదు. వీటి వల్ల మార్గం స్పష్టంగా కనిపించదు. కాబట్టి సాధ్యమైనంతవరకు వీటి వాడకం తగ్గిస్తే మేలు.
మైదుకూరులో పొగ మంచు - ఇబ్బందులు పడ్డ వాహనదారులు
సేఫ్ డిస్టెన్స్ మస్ట్ : వింటర్లో డ్రైవింగ్ అంటే ముందుగా సేఫ్ డిస్టెన్స్ పాటించడం మంచిది. దీనివల్ల సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఇది తోటి డ్రైవర్లకూ హాని కలగకుండా దోహదపడుతుంది.
ఇండికేటర్లు వెయ్యండి : పొగమంచు ఎక్కువగా ఉంటే వాహనాలను సురక్షిత ప్రదేశంలో ఆపి, ఇండికేటర్లు వేయాలి.
ఏసీ సెట్టింగ్స్‌లో మార్పు : వాహనాల అద్దాలపై ఉండే పొగమంచును క్లియర్ చేయడానికి ఏసీ సెట్టింగ్స్‌ను వార్మ్లో ఉంచడం మంచిది.