ETV Bharat / state

నాలుగు రోజులుగా ఏలూరు జిల్లాలో పులి సంచారం - ఆందోళనలో ప్రజలు

Tiger HulChul in Eluru District: ఏలూరు జిల్లాలో పులి సంచారం భయాందోళనలకు గురిచేస్తోంది. చల్లచింతలపూడిలో పులి కదలికలు కనిపించడంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయట తిరగొద్దని రైతులకు హెచ్చరికలు జారీ చేశారు.

Tiger_HulChul_in_Eluru_District
Tiger_HulChul_in_Eluru_District
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2024, 8:20 AM IST

Updated : Jan 30, 2024, 11:36 AM IST

నాలుగు రోజులుగా ఏలూరు జిల్లాలో పులి సంచారం - ఆందోళనలో ప్రజలు

Tiger HulChul in Eluru District : ఏలూరు జిల్లా దెందులూరు మండలంలోని పలు గ్రామాల్లో పులి సంచారంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. నాలుగు రోజులుగా పులి తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. పులి అడుగుజాడలు గుర్తించి దానిని పట్టుకోవడానికి అటవీశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. పులి సంచరించిన దెందులూరు మండలం మేదినరావుపాలెం, చల్లచింతలపూడి, పెరుగుగూడెం ప్రాంతాల్లో అధికారులు పర్యటించారు. పోలవరం కుడి కాలువ సమీపంలోని ఓ కాలువతో పాటు స్థానికంగా ఉన్న పలు మొక్కజొన్న తోటలు, మిరప తోటల్లో పులి అడుగులను రైతులు గుర్తించగా వారి సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు పులి జాడ కోసం గాలిస్తున్నారు.

దెందులూరు మండలంలో పులి ఆనవాళ్లు - ఆందోళనలో గ్రామస్థులు

గ్రామస్థులకు పులి భయం : చల్లచింతలపూడి పాటిమ్మ ఆలయం సమీపంలోని మిరప, మొక్కజొన్న తోటల్లో పులి అడుగులు కనిపించడంతో ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరో వైపు పులి కదలికను పసికట్టేందుకు మేదినరావుపాలెం సమీపంలో ట్రాప్ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. బోనులు సైతం సిద్ధం చేసిన అధికారులు కెమెరాల్లో నిక్షిప్తమైన పులి కదలికలను బట్టి బోన్లు ఏర్పాటు చేయాలా వద్దా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరో వైపు తమ గ్రామంలో పులి సంచారం విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి వెళ్లి పులి అడుగులను పరిశీలిస్తున్నారు. రాత్రి వేళల్లో తమ పశువులు పొలాల్లోనే ఉంటాయని, పులి సంచారంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదని గ్రామస్థులు కలవరపడుతున్నారు.

అందుబాటులోకి టోల్ ఫ్రీ నంబర్ : పాపి కొండలు అభయారణ్య ప్రాంతం నుంచి పులి వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. ప్రస్తుతం పులి అడుగులు, అది వెళ్తున్న మార్గం చూస్తుంటే మళ్లీ అది వచ్చిన దారిలోనే అటవీ ప్రాంతంలోకి వెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పులి సంచారం నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు సంబంధిత గ్రామ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాత్రి సమయాల్లో బయటకు రావద్దని, ఒంటరిగా సంచరించవద్దని చెబుతున్నారు. ఓ టోల్ ఫ్రీ నంబర్​ను సైతం అందుబాటులోకి తీసుకు వచ్చి, పులి సంచారం వివరాలు తెలిసినవారు తెలియజేయాలని సూచించారు. ఏదేమైనా పులిని గుర్తించే వరకు గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఏలూరు జిల్లాలో పులి సంచారం ! - భయాందోళనలో ప్రజలు

సోమవారం సాయంత్రం చల్లచింతలపూడిలో పులి : పులి కదలికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, అటవీ, ఇతర శాఖల అధికారులు సూచించారు. సోమవారం సాయంత్రం చల్లచింతలపూడిలో పులిని చూసినట్లు రైతులు చెప్పడంతో అబ్బయ్య చౌదరి, శిక్షణ కలెక్టరు భానుశ్రీ, తహసీల్దారు నాంచారయ్య, అటవీ శాఖ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పెద్దపులి వేటాడటం ఎప్పుడైనా చూశారా - ఇదిగో లైవ్ వీడియో చూసేయండి

Last Updated : Jan 30, 2024, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.