Two Women Died due to Thunderbolt: దీపావళి పండగ వేళ విషాదం చోటు చేసుకుంది. అకాల వర్షంతో పాటు పిడుగు పడి బాణసంచా కేంద్రంలో ప్రమాదవశాత్తు నిప్పులు ఎగిసిపడి పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
అకాలంగా కురిసిన వర్షం వర్షంతో పాటు పడిన పిడుగు ఇద్దరు మహిళలకు మరణశాసనం రాసింది. మరో ఐదుగురు ప్రాణాలతో కొట్టుమిట్టాడేలా చేసింది. తూర్పుగోదావరి జిల్లా మండలం పసలపూడి గ్రామ పరిధిలోని పొలాల మధ్య దీపావళి మందు గుండు సామాగ్రి తయారు చేసే కేంద్రం ఉంది. ఆ కేంద్రంలో ఒక పురుషుడు, ఆరుగురు మహిళలు పని చేస్తున్నారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం సాయంత్రం సమయానికి భారీ వర్షంగా మారింది. వర్షంతో పాటు పిడుగు పడింది.
పిడుగు బాణసంచా తయారీ కేంద్రం పక్కనే ఉన్న కొబ్బరి చెట్టుపై పడింది. పిడుగు పడినప్పుడు నిప్పురవ్వలు ఎగిసిపడి తయారు చేస్తున్న బాణసంచాపై పడ్డాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఇద్దరు మహిళలు మృతి చెందగా మిగిలిన ఐదుగురు గాయపడ్డారు. మృతి చెందిన వారిలో బాణసంచా తయారీ కేంద్రం యజమాని శివ భార్య శ్రీవల్లి కూడా ఉన్నారు. గాయపడిన ఐదుగురిని తణుకులోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
అక్కడ ప్రథమ చికిత్స అనంతరం ఉన్నత వైద్య సేవ నిమిత్తం ఏలూరులోని ఆశ్రమం హాస్పటల్‌కు తరలించారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను బాధిత కుటుంబీకులను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పరామర్శించారు. జిల్లా వైద్యాధికారితో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారని, ఐదుగురు గాయపడ్డారని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు వివరించారు.
సీఎం ఆరా: ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణ వ్యక్తం చేశారు. మృతి చెందిన వెగిరోతు శ్రీవల్లి, గుమ్మడి సునీత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. పిడుగుపడి గాయపడిన ఐదుగురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని అధికారులకు తెలిపారు.
విశాఖ రైల్వేస్టేషన్ ఘటన- కుట్ర ఉందన్న కోణంలో అధికారుల విచారణ
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో డీఎంఈ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డీఎంఈ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో ఏసీలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో కార్యాలయం అగ్నికి ఆహుతైంది. కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేశారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఏసీలు పూర్తిగా దగ్ధం కాగా, ప్రాణనష్టం జరగకపోవడంపై కార్యాలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
'పిడుగు పడుతుంటే చెట్ల కిందకు పరుగులు తీస్తున్నారా ! - ఇలా చేయండి'