B Tech Student Brutal Murder in Balapur : రాచకొండ కమీషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంజినీరింగ్ విద్యార్థి దారుణహత్యకు గురైన ఘటన కలకలం రేపింది. మండి 37 హోటల్‌కు సమీపాన ఉన్న ఓ పాన్ షాపు దగ్గర విద్యార్థి మోండ్రు ప్రశాంత్ (21) పై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన ప్రశాంత్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
ప్రశాంత్ ఎంవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఆ దాడి ఘటనలో ముగ్గురు దుండగులు ఉన్నట్లు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి వివరించారు. ఘటనపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇంజనీరింగ్ విద్యార్థి హత్యకు ప్రేమ వ్యవహారం లేక ఆర్థిక వివాదాల పాత కక్షలే కారణమా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
"హత్యకు గురైన ప్రశాంత్ బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ప్రశాంత్ సహా నలుగురు వ్యక్తులు పాన్‌షాపు వద్దకు వచ్చి సిగెరెట్ తీసుకున్నారు. నలుగురి మధ్య గొడవ జరిగింది. వారిలో ఒకరు ప్రశాంత్‌పై కత్తితో దాడి చేసి పరారయ్యారు. ఘటనపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నాం. హత్యకు గురైన ప్రశాంత్ ఎంవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నట్టు గుర్తించాం."-సునీతారెడ్డి, మహేశ్వరం డీసీపీ
అనాథ శవాలనూ వదలని ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్ - సిట్ విచారణలో సంచలన విషయాలు! - kolkata doctor case