Three IAS Officers Transferred in AP: రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో విధులు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులూ జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఛైర్మన్లను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం: రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ పోస్టుల్లోని ఛైర్మన్లను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఛైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యుల నుంచి రాజీనామాలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులకు సీస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నామినేటెడ్ పోస్టులన్నీ ఖాళీ కానున్నాయి.
ఈనెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్! - TDP Leaders Inspecting Venue
ఓటమిని భరించలేక వైఎస్సార్సీపీ మూకల దాడి- టీడీపీ నేతలకు తీవ్రగాయాలు - YSRCP ATTACKS