Threatening call to Deputy CM Pawan Kalyan Office: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ ఆగంతకుడు సందేశాలు పంపించాడు. పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్, సందేశాలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులకు సైతం సమాచారం అందించారు. పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్‌పై హోంమంత్రి అనిత డీజీపీ ద్వారకా తిరుమలరావుతో మాట్లాడారు. ఆగంతుకుడి నుంచి పవన్ కల్యాణ్ పేషీకి రెండుసార్లు కాల్స్ వచ్చాయని అనితకు డీజీపీ వివరించారు.
నిందితుడి కోసం గాలింపు చర్యలు: బెదిరింపు కాల్స్‌పై రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పేషీకి 950550556 నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో కూడా హోంమంత్రి అనితకు ఇదే నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ నెంబరు మల్లిఖార్జున రావు అనే వ్యక్తి పేరు మీద ఉంది. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
విజయసాయిరెడ్డిపై కేసులు తప్పవు - ఎవరెవరిని బెదిరించారో తెలుసు : హోంమంత్రి అనిత
అజ్ఞాతం వీడిన అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి - కడప సైబర్ క్రైం స్టేషన్లో విచారణ