ETV Bharat / state

షిర్డీ- కాకినాడ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం - రూ.30 లక్షలకు పైగా సొమ్ము లూటీ - robbery in shirdi express - ROBBERY IN SHIRDI EXPRESS

Thieves Attack Shirdi- Kakinada Express : షిర్డీలో దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులపై దోపిడీ దొంగలు విరుచుకుపడ్డారు. తెల్లవారుజామున రైలులోకి ప్రవేశించి దుండగులు లూటీ చేశారు. సుమారు రూ.30 లక్షల విలువైన నగలు, డబ్బు దోపిడి జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు.

Thieves rob Shirdi- Kakinada Train
Thieves attack Shirdi- Kakinada Express (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 26, 2024, 3:57 PM IST

Updated : Jul 27, 2024, 6:33 AM IST

Thieves Rob Shirdi- Kakinada Train : షిర్డీ సాయినగర్ నుంచి కాకినాడ వెళ్లే కాకినాడ పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో రైలులోకి చొరబడి అందినకాడికి దోచుకున్నారు. ఈ ఘటన ఇవాళ తెల్లవారుజామున మహారాష్ట్రలోని పర్లి రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని షిర్డీ సాయి నాథుడిని దర్శించుకుని అక్కడి నుంచి రైలు ఎక్కి ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారు.

రూ.10వేలకు 20 వేలు వస్తాయన్నారు - చివరకు రూ.10కోట్లు కొట్టేశారు - Investment Fraud in Karimnagar

రాత్రి ఒంటి గంట సమయంలో కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ రైలు పర్లీ స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ కొంతమంది దుండగులు సాధారణ ప్రయాణికుల మాదిరిగా బీ-4, బీ-5, బీ-6 ఏసీ బోగీల్లోకి ఎక్కారు. ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో వారి వద్ద ఉన్న బ్యాగుల్లో ఉన్న నగలు, బంగారు గొలుసులు, చెవి దుద్దులు, ఉంగరాలు, సెల్‌ఫోన్‌లు, బ్రాస్‌లెట్లు, అవసరానికి తీసుకొచ్చిన నగదును దోచుకుని తెల్లవారుజామున రెండు నుంచి మూడు గంటల లోపు దోపిడి చేసి మెల్లగా జారుకున్నారు.

మెళకువ వచ్చిన ప్రయాణికులు చూసుకునేసరికి తాము దోపిడీకి గురయ్యామని గుర్తించారు. సుమారు 25 మందికి చెందిన బ్యాగులు దోపిడీకి గురైనట్లు బాధితులు తెలిపారు. కొంతమంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల్లో దాదాపు అందరూ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏలూరు, వెస్ట్ గోదావరి తదితర ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారని రైల్వే పోలీసులు తెలిపారు. సుమారు 20లక్షల విలువైన నగలు, నగదు దోపిడి జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు.

"రాత్రివేళ దొంగలు రైలులో ప్రవేశించి బంగారం, డబ్బును లూటీ చేశారు. మేము మొదట ఎవరిని గుర్తించలేదు. వారు కూడా ప్రయాణికులుగానే భావించాం. అందరం నిద్రలోకి జారుకున్నాం. అక్కడ కొంతమంది దుండగులు సాధారణ ప్రయాణికుల మాదిరిగా బీ-4, బీ-5, బీ-6 ఏసీ బోగీల్లోకి ఎక్కి బ్యాగుల్లో ఉన్న సొమ్మునంతా ఎత్తుకెళ్లారు. సుమారు 25 మందికి చెందిన బ్యాగులు దోపిడీకి గురయ్యాయి. వస్తువుల చోరీపై సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాము". - సంధ్య, బాధితురాలు

దిల్​సుఖ్​నగర్​ బాంబ్​ బ్లాస్ట్​ మాస్టర్​ మైండ్​ సయ్యద్​ మఖ్బూల్​ మృతి - Terrorist Syed Maqbool Died

బాలుడి పాలిట యమపాశమైన టైరు - మూత్ర విసర్జన చేస్తుండగా? - boy died hit by a vehicle tire

Last Updated : Jul 27, 2024, 6:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.