ETV Bharat / state

మీకు వీణా - వాణిలు గుర్తున్నారా..?, సొంతూరులో ఘనంగా పుట్టినరోజు వేడుకలు

సొంతూర్లో అవిభక్త కవలలు వీణా, వాణిల జన్మదిన వేడుకలు - కుటుంబసభ్యుల సొంతూర్లో తొలిసారి పుట్టినరోజు వేడుకలు - ప్రస్తుతం శిశువిహార్​లోనే ఉంటున్న అవిభక్త కవలలు

TWINS VEENA AND VANI
VEENA VANI BIRTHDAY CELEBRATIONS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2024, 4:50 PM IST

Updated : Oct 17, 2024, 3:14 PM IST

Inseparable Twins Veena-Vani : అవిభక్త కవలలు వీణ-వాణిలు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. పుట్టుకతోనే తలలు అతుక్కుని జన్మించిన వీరు నూతన సాంకేతిక వైద్యరంగానికే సవాలుగా నిలిచి విడదీయరాని బంధంగా నిలిచారు. బుధవారం ఈ అవిభక్త కవలలు 21 వసంతాలు పూర్తి చేసుకుని 22వ వసంతంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని శిశు విహార్‌లోనే వీరికి ఏటా బర్త్​ డే నిర్వహించేవారు. తొలిసారి వీరు తమ స్వగ్రామంలో కుటుంబసభ్యులు, బంధువుల మధ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

వీరి స్వగ్రామం మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం. మారగాని మురళి-నాగలక్ష్మి దంపతులకు 2003 అక్టోబర్‌ 16న సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వీరు జన్మించారు. పుట్టుకతోనే వీరు రెండు తలలు అతుక్కుని జన్మించారు. వీరికి గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యుడు నాయుడమ్మ వైద్య చికిత్స అందించారు.

వీరికి ఆపరేషన్​ చేసి వేరు చేసేందుకు దేశ విదేశీ వైద్యులు వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విడదీయని వీరి బంధానికి సరిగ్గా నేటికి 21 ఏళ్లు పూర్తయ్యాయి. వీరు నీలోఫర్ ఆసుపత్రిలోనే 13 ఏళ్ల దాకా ఉన్నారు. తరువాత హైదరాబాదులోని స్టేట్ హోమ్ వీరికి నివాసంగా మారింది. గత 21 సంవత్సరాలుగా చైల్డ్ హోమ్​లోనే జన్మదిన వేడుకలను జరుపుకున్న ఈ కవలలు తొలిసారిగా తమ సొంతూరైన బీరిశెట్టి గూడెం గ్రామానికి వచ్చారు.

సంక్లిక్షమైన సర్జరీ : వీణా-వాణిలకు శస్త్రచికిత్స చేసేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, లండన్‌ వంటి దేశానికి చెందిన వైద్యులు వచ్చి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే సర్జరీ సంక్లిష్టమైనది కావడంతో ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. దీంతో వీరి ఆపరేషన్‌ అలాగే ఏళ్ల తరబడి నిలిచిపోయిందని తల్లిదండ్రులు వాపోయారు. ప్రస్తుతం వీరు యూసఫ్​గూడలోని స్టేట్‌హోంలో ఉంచారు. ఇరువురు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నారు.

ప్రభుత్వ సంరక్షణలోనే: వీరికి అన్ని రకాల సేవలు, ఆలనా పాలనా అక్కడ స్టేట్​ హోం వారే చూస్తున్నారు. గతేడాది వీణవాణీలు తమ సొంతూరు బీరిశెట్టిగూడెం వచ్చి కుటుంబ సభ్యులతో గడిపి వెళ్లారు. తమ పిల్లలకు ఆపరేషన్‌ చేయాలని అన్ని ప్రభుత్వాలను, ముఖ్యమంత్రులను కలిసి వేడుకున్నా ఫలితం లేకుండా పోయిందని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తమ పిల్లలతో కలిసి ఉండేందుకైనా ప్రభుత్వం అవకాశం కల్పించాలని కోరినా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు తమ బాధను వ్యక్తం చేశారు.

22 ఏళ్ల తర్వాత వీణా-వాణి తమ వద్దకు రావడంతో తల్లిదండ్రులు ఆనందంతో పొంగిపోయారు. కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సభ్యులు బంధువులు సైతం వేడుకల్లో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తమ సొంత గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని కవలలు వీణా వాణిలు ఆనందం వ్యక్తం చేశారు.

శిల్పకళా వేదికగా చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ - స్పెషల్ అట్రాక్షన్​గా డైరెక్టర్స్ బాబీ, వశిష్ట - MEGASTAR BIRTHDAY CELEBRATIONS 2024

కేబుల్ బ్రిడ్జిపై బర్త్​డే వేడుకలు - వివాదంలో చిక్కుకున్న మాదాపూర్ సీఐ - Madhapur CI involved in controversy

Last Updated : Oct 17, 2024, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.