ETV Bharat / state

చిల్లర కష్టాలకు చెక్ - ఇకపై ఆర్టీసీ బస్సుల్లోనూ ఫోన్​ పే, గూగుల్​ పే - త్వరలోనే అందుబాటులోకి - digital payments in tgsrtc - DIGITAL PAYMENTS IN TGSRTC

TGSRTC Digital Payments : గ్రేటర్​ హైదరాబాద్​లో ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్​ చెల్లింపుల విధానం అందుబాటులోకి రాబోతుంది. టీజీఎస్​ఆర్టీసీ అంతకుముందు పైలట్​ ప్రాజెక్టుగా ఒక రూట్​లో ప్రవేశపెట్టింది. అవి సత్ఫలితాలు ఇవ్వడంతో మిగతా రూట్లలో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. పైలట్​ ప్రాజెక్టులో భాగంగా ఎదురైన సమస్యలు, వాటి పరిష్కారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. సమస్యలు తలెత్తకుండా పక్కాగా డిజిటల్​ చెల్లింపులు జరిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

TGSRTC Digital Payments
TGSRTC Digital Payments (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 16, 2024, 8:06 AM IST

Updated : Jul 16, 2024, 8:12 AM IST

Digital Payments in TGSRTC Buses in Hyderabad : ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్‌ చెల్లింపులే జరుగుతున్నాయి. ఛాయ్‌వాలా నుంచి కిరాణ కొట్టు వరకు ప్రతి చిన్నదానికి సైతం ప్రజలు డిజిటల్‌ చెల్లింపులకు అలవాటు పడిపోయారు. జేబులో డబ్బులు ఉంచుకోవడం లేదు. నేరుగా డిజిటల్‌ చెల్లింపులకే ఇష్టపడుతున్నారు. ఇలాంటి తరుణంలో టీజీఎస్ ​ఆర్టీసీ సైతం ఆ దిశగా ఆలోచనలు చేసింది. ఇప్పటికే ఓలా, ఊబర్‌ వంటివి డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఆర్టీసీ సైతం ప్రయాణికులను తమవైపు తిప్పుకోవడానికి డిజిటల్‌ చెల్లింపులకు అవకాశం కల్పించాలని భావిస్తుంది. అందులో భాగంగానే డిజిటల్‌ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది.

ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్‌ పేమెంట్‌ విధానాన్ని కొత్తగా అమల్లోకి తీసుకువస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విమానాశ్రయానికి నడిపించే బస్సుల్లో ప్రయోగాత్మకంగా డిజిటల్‌ పేమెంట్‌ విధానాన్ని అమలు చేశారు. ఈ విధానం విజయవంతం కావడంతో ఇటీవలే టికెట్‌ జారీకి డిజిటల్‌ పేమెంట్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలోని అన్ని మార్గాల్లో నడుస్తున్న దాదాపు 40 ఎయిర్‌ పోర్టు బస్సుల్లో డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని అమలు పరుస్తున్నట్లు సికింద్రాబాద్ రీజినల్‌ అధికారులు తెలిపారు.

వీటితో పాటు బండ్లగూడ, దిల్‌సుఖ్‌నగర్‌ సిటీ బస్సులకు ఐ-టిమ్స్‌ను ఇచ్చారు. ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాంతరానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆధునిక సాంకేతికతను విస్తరించాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. కండక్టర్లకు 10 వేల ఐ-టిమ్స్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డిజిటల్‌ చెల్లింపుల విధానం ద్వారా టికెట్‌ జారీ చేయడానికి ప్రయాణికులు స్కానింగ్‌, ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి యూపీఐ (UPI) సేవలు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో స్వైపింగ్‌ వంటి అన్ని రకాల పద్ధతుల్లో వినియోగించవచ్చు. ఇందుకోసం తీసుకొచ్చిన ఐ‌-టిమ్స్‌ మిషన్లకు ఇంటర్‌నెట్‌ సదుపాయం కల్పించారు.

ఎయిర్​పోర్టుకు వెళ్లే బస్సుల్లో అమలు : అన్ని విధాలుగా అధ్యయనం చేసిన తర్వాత ఎయిర్‌పోర్టుకు వెళ్లే బస్సులలో అమలు పరుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నగరంలో ఉన్న అన్ని రకాల సిటీ బస్సులలో కూడా వీలైనంత త్వరలోనే ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. రాబోయే రెండు, మూడు నెలల్లోనే డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని విస్తరించడానికి ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు వెళ్లే పలు బస్సుల్లో డిజిటల్‌ సేవలు విస్తరించారు. ప్రస్తుతం దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

అనంతరం దశల వారీగా జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, ఏసీ, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, రాజధాని, గరుడ, లగ్జరీ వంటి వాటిలో కూడా ఈ విధానాన్ని తీసుకురావడానికి టీజీఎస్​ఆర్టీసీ(TGSRTC) అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ విధానం పూర్తిగా అమల్లోకి వస్తే టికెట్‌ జారీ క్రమంలో కండక్టర్లకు తలెత్తే చిల్లర సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం బస్‌ పాస్‌ల జారీకి ఆయా కేంద్రాలలో డిజిటల్‌ చెల్లింపు విధానం అందుబాటులో ఉందని దాని వల్ల ప్రయాణికులకు డబ్బులు చెల్లింపుల ప్రక్రియ మరింత సులభమైందని అధికారులు పేర్కొంటున్నారు. అన్ని బస్సులలో డిజిటల్‌ చెల్లింపు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు.

మెట్రో లేని ప్రాంతాల్లో 10 నిమిషాలకో ఆర్టీసీ బస్సు - ప్రయోగాత్మకంగా ఈ మార్గాల్లో అమలు - RTC Routes Bus Extended in Hyd

ముందు నుంచి ఎక్స్​ప్రెస్​ - వెనక నుంచి పల్లె వెలుగు - కంగుతినేలా ఆర్టీసీ బస్సు రంగు

Last Updated : Jul 16, 2024, 8:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.