TGSRTC MD Sajjanar Serious on Bus Stunt Viral Video : ఏమైనా చేద్దాం, కానీ వైరల్ అయిపోదామనుకుంటూ కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో చేస్తున్న పిచ్చి చేష్టలకు హద్దూపద్దూ లేకుండా పోతుంది. అటువంటి ఓ యువకుడు చేసినట్లు వస్తున్న బస్సు స్టంట్ వీడియోనే ఇప్పుడు సామాజిక మాధ్యమంతటా తెగ వైరల్గా మారింది. వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు కింద ఒక వ్యక్తి పడుకుంటాడు.
బస్సు సాఫీగా అతడి పైనుంచి వెళుతుంది. కానీ అతడికి ఏ ప్రమాదం సంభవించదు. అతడు తాపీగా లేచి నడుచుకుంటూ వెళతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో ఫేక్ అని, పూర్తిగా ఎడిటెడ్ చేసిన వీడియోను కొందరు వైరల్ చేస్తున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు అని ఆయన హితవు పలికారు.
Bus Stunt Fake Viral Video : చిత్ర విచిత్రాలతో కొందరు ఆకతాయిలు చేస్తోన్న ఈ రీల్స్ లైక్లు, కామెంట్ల కోసం తప్ప, ఇంకేమీ రాదు. ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉందన్నారు. సరదా కోసం చేసే ఎడిటెడ్ వీడియోలు ఇతరులకు ప్రాణాపాయం కూడా కలిగిస్తాయని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంటోందని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
"సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఫేక్. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్ మీడియాలో పాపులర్ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు. లైక్లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉంది. సరదా కోసం చేసే ఎడిటెడ్ వీడియోలు ఇతరులకు ప్రాణాప్రాయం కూడా కలిగిస్తాయి. ఇలాంటి ఘటనలను #TGSRTC యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంటోంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది."-వీసీ సజ్జనార్, టీజీఎస్ఆర్టీసీ ఎండీ ఎక్స్ పోస్ట్
మహిళపై తీవ్రంగా దాడి చేసిన గేదె- కొమ్ములతో రోడ్డుపై ఈడ్చుకెళ్లి! - Buffalo Attack Video