TGSPDCL Mobile App to Pay Electricity Bill : థర్డ్ పార్టీ యాప్‌లతో కరెంటు బిల్లులు చెల్లించవద్దని ఆర్బీఐ గైడ్‌లైన్స్ పాస్ చేసిన విషయం తెలిసిందే. మరి ఎలా కరెంటు బిల్లు కట్టాలని వినియోగదారుడు అనుకున్నాడు. ఈ స్థితిలో విద్యుత్ పంపిణీ సంస్థనే ఓ యాప్‌ను వినియోగంలోకి తెచ్చింది. ఇప్పుడు ఆ యాప్‌ను ఎక్కువ మంది వినియోగదారులు డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా బిల్లు పేమెంట్ చేస్తున్నారు. అదే టీజీఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్. ప్రస్తుతం విద్యుత్ కరెంటు బిల్లు చెల్లించేందుకు సంబంధించి ఈ యాప్ ఫేమస్ అవుతుంది. ఎందుకంటే ఈ నెల శనివారం నాటికి 1.92 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు.
కేవలం శనివారం ఒక్కరోజే 70 వేల మంది టీజీఎస్పీడీసీఎల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. యాప్‌తో బిల్లుల చెల్లింపులు మాత్రమే కాకుండా ఇతర ప్రయోజనాలు ఉన్నాయని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కరెంటు బిల్లు చెల్లింపులో ఈ యాప్‌ను ఉపయోగిస్తూ వినియోగదారుడు సంతృప్తి చెందుతున్నాడు.
80 శాతం మంది ఆన్లైన్లో బిల్లుల చెల్లింపు : గతంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, బిల్ డెస్క్ వంటి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్స్ ద్వారా నగరంలో దాదాపు 80 శాతం మంది ఆన్లైన్లోనే విద్యుత్ బిల్లులను చెల్లించేవారు. ఎందుకంటే వీటికి ఎలాంటి యూజర్ ఛార్జీలు అనేవి చెల్లించేవారు. అందుకే అత్యధిక మంది యూపీఐ చెల్లింపుల వైపే మొగ్గు చూపారు. అయితే వీటిలో కొన్ని ఆర్బీఐ నిబంధనల మేరకు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌తో ఎనేబుల్ చేసుకోలేదు.
అందుకే ఆ థర్డ్ పార్టీ యాప్‌లలో నేరుగా విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తెలిపింది. అయితే బిల్లుల చెల్లించేందుకు విద్యుత్ సంస్థ వెబ్సైట్, యాప్‌లో లేదా వీటిని కన్పించే థర్డ్‌పార్టీ యాప్‌లలోనూ చెల్లించవచ్చని ఇటీవల సూచించింది. దీంతో ఆ యాప్‌లకు దిమ్మతిరిగేలా ఐదు రోజులుగా డిస్కం యాప్‌లను పెద్ద సంఖ్యలో ఉపయోగించడం వినియోగదారులు ప్రారంభించారు. దీని ద్వారా శనివారం వరకు 2.5 లక్షల మంది కరెంటు బిల్లులు చెల్లించారని అధికారులు వివరించారు.
విద్యుత్ సంస్థ యాప్ వల్ల కలిగే ఉపయోగాలు :
- యాప్ మొబైల్లో ఉండటం ద్వారా విద్యుత్ అంతరాయాలపై ఫిర్యాదు చేయవచ్చు.
- అలాగే వోల్టేజీ హెచ్చుతగ్గులపై ఫిర్యాదు చేయవచ్చు.
- విద్యుత్‌కు సంబంధించిన ఇతర సమస్యలైనా డిస్కం దృష్టికి తీసుకువెళ్లవచ్చు.
- మీటర్ కాలిపోవడం, బిల్లింగ్‌లో తప్పులపై ఫిర్యాదు చేయవచ్చు.
- గత బిల్లుల వివరాలు చూసుకోవచ్చు.
- ఇంట్లో ఇప్పుడు వినియోగిస్తున్న లోడ్‌ను పెంచుకోవడానికి కరెంట్ కార్యాలయానికి వెళ్లాల్సిన పనిలేదు. యాప్ నుంచే నిర్ధారిత మొత్తం చెల్లిస్తే సరిపోతుంది.
- టైటిల్ ట్రాన్స్‌ఫర్ సహా, కొత్త కనెక్షన్ వరకు యాప్ నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దేశించిన పని దినాల్లో సేవలు పొందవచ్చు.