ETV Bharat / state

గ్రూప్-2 పరీక్ష హాల్​టికెట్లు విడుదల - ఇలా డౌన్​లోడ్ చేసుకోండి - GROUP 2 EXAM HALL TICKETS

టీజీపీఎస్సీ వెబ్​సైట్​లో గ్రూప్-2 హాల్​ టికెట్లు - ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న గ్రూప్-2 పరీక్షలు

GROUP-2 EXAM HALL TICKETS
టీజీపీఎస్సీ వెబ్​సైట్లో గ్రూప్-2 పరీక్ష హాల్​టికెట్లు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 9, 2024, 3:23 PM IST

Updated : Dec 9, 2024, 4:16 PM IST

Group-2 Hall Tickets Realesed : గ్రూప్​-2 పరీక్ష హాల్​టికెట్లను టీజీపీఎస్సీ అందుబాటులోకి తెచ్చింది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్​సైట్ ద్వారా డౌన్​లోడ్ చేసుకోవచ్చని అభ్యర్థులకు సూచించింది. వచ్చే వారం 15, 16(డిసెంబర్​)వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు తెలంగాణ వ్యాప్తంగా జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1368 పరీక్ష కేంద్రాలను టీజీపీఎస్సీ​ ఏర్పాటు చేసింది. దాదాపుగా ఈ పరీక్షకు 5.51లక్షల దరఖాస్తులు వచ్చాయి. హాల్​టికెట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

రెండ్రోజులు వరుసగా ఉదయం, మధ్యాహ్నం కలిపి మొత్తం నాలుగు పేపర్లతో గ్రూప్‌-2 పరీక్షలు జరగనున్నాయి. ఉదయం జరిగే పేపర్​ -1, పేపర్​-3లకు 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు అభ్యర్థులను ఎక్సామ్​ సెంటర్​లోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరిస్తారు.

హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ కోసం అభ్యర్థులు తమకు సంబంధించిన టీజీపీఎస్సీ ఐడీ నెంబరు, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి. అనంతరం డౌన్​లోడ్​ పీడీఎఫ్​ అనే ఆప్షన్​పై క్లిక్​ చేస్తే వెంటనే హాల్​టికెట్​ డౌన్​లోడ్​ అవుతుంది. ఈ ప్రక్రియలో ఏవైనా సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు వీలుగా జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు వర్కింగ్​ డేస్​లో ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 6.00గంటల వరకు ఈ నంబర్లకు ఫోన్​ చేసి వివరాలను సేకరించవచ్చు. ఇంకా అదనపు సమాచారం కావాలంటే టీజీపీఎస్సీ హెల్ప్‌లైన్‌ నంబర్లు 23542185/23542187/040-22445566/కు కాల్ చేయొచ్చు. లేదా ఈ-మెయిల్‌ కావాలంటే helpdesk@tspsc.gov.inకు చేయవచ్చు.

GROUP-2 EXAM HALL TICKETS
TGPSC HELP LINE NUMBERS (ETV Bharat)

గ్రూప్​-2 పరీక్ష ప్రకటన 2022లో 783 పోస్టులతో వెలువడింది. పలు కారణాల రిత్యా ఇప్పటివరకు నాలుగు సార్లు వాయిదా పడింది. గత నెలలో జరిగిన గ్రూప్​-1 ఫలితాలు ప్రకటించిన తర్వాతనే గ్రూప్​-2 రిజల్ట్స్​ ఇచ్చే అవకాశముందని ఉన్నాతాధికారులు తెలిపారు. ఇటీవల టీజీపీఎస్సీ ఛైర్మన్​గా నియమితులైన సీనీయర్​ ఐఏఎస్​ బుర్రా వెంకటేషం కమిషన్​పై మరింత విశ్వాసం పెరిగేలా పరీక్షల నిర్వాహణ ఉంటుందని అన్నారు.

గ్రూప్‌-2 అభ్యర్థులకు మరో అప్​డేట్ - ఈనెల 9 నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు లభ్యం

ఒకే రోజు గ్రూప్​-2, ఆర్​ఆర్​బీ జేఈ పరీక్షలు - ఆందోళనలో అభ్యర్థులు

Last Updated : Dec 9, 2024, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.