ETV Bharat / state

టీడీపీ అభ్యర్థి వాహనంపై వైసీపీ దాడి- గుంటూరులో ఉద్రిక్తత

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 20, 2024, 3:18 PM IST

Updated : Mar 20, 2024, 4:54 PM IST

Tension Atmosphere At Nallapadu Police Station: గుంటూరులోని నల్లపాడు పోలీసుస్టేషన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి బలసాని కిరణ్ వాలంటీర్లతో గుంటూరు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశం గురించి తెలుసుకుని కార్యాలయానికి వెళ్లిన టీడీపీ నేత రామాంజనేయులు వాహనంపై వైఎస్సార్సీపీ నేతలు దాడికి దిగారు.

Tension_Atmosphere_At_Nallapadu_Police_Station

Tension Atmosphere At Nallapadu Police Station: ఎన్నికల కోడ్ (Election code)అమల్లోకి వచ్చినా, వాలంటీర్లను ఎన్నికల విధుల్లో వినియోగించవద్దని అధికారులు ఆదేశిస్తున్నా వైఎస్సార్సీపీ నేతలకు పట్టటం లేదు. ఎన్నికల కోడ్‌ను పటిష్ఠగా అమలు చేయాలని ఎస్ఈసీ (SEC) మొరపెట్టుకుంటున్నా వైఎస్సార్సీపీ సర్కార్‌ మాత్రం 'మా నిబంధనలు వేరే ఉంటాయిలే' అన్నట్లు వ్యవహరిస్తోంది. నిబంధనలను పాటించకపోగా ఓటర్లను యథేచ్ఛగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో వాలంటీర్లు వైఎస్సార్సీపీ అనుగుణంగా పనిచేసేలా కానుకలు ఇచ్చే కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ అభ్యర్థి బలసాని కిరణ్‌ (YSRCP Leader Balasani Kiran) సమావేశం నిర్వహించారు.

పులివర్తి నాని ఫ్లెక్సీల తొలగింపు- టీడీపీ, వైసీపీ కార్యకర్తల వాగ్వాదం

YSRCP Leader Gifts To Volunteers: కానుకలు, డబ్బులు ఇచ్చి వైఎస్సార్సీపీకి అనుకూలంగా పనిచేయాలని వైఎస్సార్సీపీ నేత వాలంటీర్లకు విజ్ఞప్తి చేశారు. సమావేశం గురించి తెలుసుకుని కార్యాలయానికి చేరుకున్న టీడీపీ నేత రామాంజనేయులు వాహనంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ దాడిపై ఫిర్యాదు చేసేందుకు రామాంజనేయులు నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడికీ చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ కార్యకర్తలే వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి చేయడానికి వచ్చారని ఆరోపిస్తూ టీడీపీ నేతలపై ప్రతిదాడికి ప్రయత్నించారు. ఇరువర్గాలు పోలీసు స్టేషన్ (Police station) ఆవరణలోనే పరస్పరం తోపులాట, వాగ్వాదం జరిగింది. పోలీసులు అతికష్టం మీద టీడీపీ అభ్యర్ధి రామాంజనేయులును అక్కడి నుంచి వాహనంలో పంపించేశారు. అయినా వైఎస్సార్సీపీ శ్రేణులు స్టేషన్ ఆవరణలో హంగామా సృష్టించారు.

టీడీపీ నేత నల్లమిల్లి ఇంటి వద్ద ఉద్రిక్తత- వైసీపీ ఎమ్మెల్యే అవినీతిపై చర్చకు సవాల్‌

TDP Leader Ramanjaneyulu About Attack: వైఎస్సార్సీపీ నేత బలసాని కిరణ్ కుమార్ కార్యాలయం వద్ద వాలంటీర్లకు డబ్బులు, కానుకలు పంపిణీ చేస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని పరిశీలనకు అటువైపుగా వెళ్లగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని రామాంజనేయులు తెలిపారు. కారు అద్దాలు పగులగొట్టడమే కాకుండా కార్యకర్తలపై దాడి చేశారని, ఈ ఘటనపై ఫిర్యాదు ఇచ్చేందుకు నల్లపాడు పోలీసు స్టేషన్​కు వెళ్తే అక్కడకు కూడా చేరుకుని పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలతో ఘర్షణ పడ్డారని రామాంజనేయులు పేర్కొన్నారు. ఐదేళ్లు అధికార దర్వినియోగం చేసిన వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా అదే సంస్కృతిని కొనసాగిస్తున్నారని రామాంజనేయులు మండిపడ్డారు.

టీడీపీ అభ్యర్థి వాహనంపై వైసీపీ దాడి- గుంటూరులో ఉద్రిక్తత

టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యే- ఇరు వర్గీయుల మధ్య ఘర్షణ

ఎన్నికల విధుల్లో వాలంటీర్లను వినియోగించరాదని గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ ఎం.శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను మంగళవారం ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలని సూచించారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్య ర్థులకు పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దని వివరించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఈ ఆదేశాలను పంపించాలని శివప్రసాద్ సూచించారు

Last Updated : Mar 20, 2024, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.