ETV Bharat / state

మన్యం గజగజ - 4.1 డిగ్రీలకు పడిపోయిన ఉష్టోగ్రతలు! - LOW TEMPERATURE IN TRIBAL VILLAGES

ఈ రోజు కూడా చలి తీవ్రత కొనసాగుతుందని చెబుతున్న వాతావరణ నిపుణులు

temperature_drops_in_tribal_villages
temperature_drops_in_tribal_villages (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Temperature Drops in Tribal Villages : రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన చలితో జనాలు వణికిపోతున్నారు. మరో వైపు రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఆ ప్రాంత ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాలేకపోతున్నారు. ఆదివారం రాత్రి అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో కనిష్ఠ ఉష్ణోగ్రత 4.1 డిగ్రీలుగా నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇదే అతి తక్కువ ఉష్ణోగ్రత.

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 16 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపే నమోదయ్యాయి. అరకులో 4.8, డుంబ్రిగుడలో 6, గూడెం కొత్తవీధిలో 7.3, హుకుంపేటలో 7.8 డిగ్రీలుగా నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, శ్రీసత్యసాయి, అనకాపల్లి, అనంతపురం, నంద్యాల, చిత్తూరు, ఎన్టీఆర్, ప్రకాశం, పల్నాడు, అన్నమయ్య, ఏలూరు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకంటే తగ్గాయి.

చలి కాలంలో డ్రైవింగ్​ - ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులోని అన్ని జిల్లాల్లో మంగళవారం చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. బుధవారం చలిగాలుల నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని వివరించారు.

పెరుగుతున్న చలి - జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.