Telugu Desam Leaders Celebrations : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 34 మందితో టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా గురువారం విడుదలైంది. అధిష్ఠానం వివిధ రూపాల్లో ప్రజాభిప్రాయాలను సేకరించిన అనంతరం అభ్యర్థులను ఎంపిక చేసింది. ఒత్తిళ్లు, సిపార్సులకు తలొగ్గకుండా నాయకులు, కార్యకర్తల మెజార్టీ అభిప్రాయానికే పెద్దపీట వేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటాయి.
టీడీపీ రెండో జాబితా విడుదల - అభ్యర్థుల సంబరాలు - గెలుపుపై ధీమా
బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ: తెలుగుదేశం అభ్యర్థులు రెండో జాబితాను పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించటంతో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. బాణ సంచా కాలుస్తూ మిఠాయిలు తినిపించుకున్నారు. ఫిబ్రవరి 24న విడుదల చేసిన తొలిజాబితాలో అధిష్ఠానం 94 మంది పేర్లు ప్రకటించగా తాజాగా రెండో జాబితాలో 34 మంది పేర్లును విడుదల చేసింది. దీంతో భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. భారీ ర్యాలీ ప్రదర్శన చేపడుతున్నారు.తమ నాయకులకు సీట్లు ఖరారు చేయటంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు.
అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి పెద్దపీట - ఆశీర్వదించి గెలిపించాలి: చంద్రబాబు
Chintamaneni Prabhakar : తెలుగుదేశం ప్రకటించిన మలివిడత జాబితాలో ఫైర్‌బ్రాండ్ చింతమనేని ప్రభాకర్‌కు సీటు దక్కడంతో కార్యకర్తలు, అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. తన స్వగ్రామం ఏలూరు జిల్లా దుగ్గిరాల నుంచి ర్యాలీగా బయలుదేరి ఏలూరు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం తిరిగి స్వగ్రామంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో చింతమనేని పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి పేరు ఖరారు చేయడంతో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట టీడీపీ అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి పేరు ప్రకటించడంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి భారీ ర్యాలీలో పాల్గొన్నారు.
టీడీపీ రెండో జాబితా విడుదల చేసిన చంద్రబాబు- 34మందికి చోటు
Anam Rannarayana Reddy : నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆభ్యర్థిగా మాజీమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి పేరు ప్రకటించడంతో పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. గాజువాక సీటు తనకు కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు తూర్పు టికెట్ నసీర్ అహ్మద్‌కు కేటాయించడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.