ETV Bharat / state

ఆస్ట్రేలియాలో తెలంగాణ వాసి అనుమానాస్పద మృతి - హత్యా? ఆత్మహత్యా? - TELANGANA MAN DIED IN AUSTRALIA - TELANGANA MAN DIED IN AUSTRALIA

Telangana Man Suspicious Death in Australia : ఆస్ట్రేలియాలో రంగారెడ్డికి చెందిన ఓ వ్యక్తి​ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి మృతదేహం సముద్రంలో లభ్యమైంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Young Man Suspicious Death in Australia
Arvind Suspicious Death Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 11:50 AM IST

Updated : May 24, 2024, 3:23 PM IST

Young Man Suspicious Death in Australia : ఆస్ట్రేలియాలో తెలంగాణ వాసి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​కు చెందిన అరవింద్ ఐదు రోజుల క్రితం ఆస్ట్రేలియాలో అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతడి ఆచూకీ కోసం గాలింపు షురూ చేశారు. ఈ క్రమంలో సముద్రతీరంలో మృతదేహం లభ్యమైంది.

కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : రంగారెడ్డి జిల్లాలోని షాద్​నగర్​కు చెందిన అరవింద్ (30) బీజేపీ నేత అరటి కృష్ణ ఏకైక కుమారుడు. ఉద్యోగరీత్యా 12 సంవత్సరాల క్రితం సిడ్నీలో స్థిరపడ్డారు. తల్లి ఉషారాణి, అరవింద్ భార్యతో కలిసి జనవరి చివరి వారంలో ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం సిడ్నీ నగరంలో వాతావరణం పడకపోవడంతో అతడి తల్లి ఉషారాణి స్వస్థలమైన షాద్​నగర్​కు తిరిగొచ్చారు.​ సోమవారం రోజున అరవింద్ తన భార్యతో స్వదేశానికి వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకుని మిగిలిన ఏర్పాట్లు చేసుకున్నారు.

అమెరికాలో రోడ్డు ప్రమాదం - ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి - Telangana Students Died In America

Arvind Suspicious Death Case in Sidney : : భారతదేశానికి టికెట్లు బుక్​ చేసుకున్న అనంతరం కారు వాష్​ చేయించేందుకు అరవింద్​ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఎంతసేపయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలో సముద్రంలో ఓ యువకుడి శవం లభ్యమైంది. అది అరవింద్ మృతదేహామా? కాదా? అని నిర్ధారించేందుకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

కానీ గుర్తుపట్టే స్థితిలో లేకపోవడంతో మృతదేహానికి శవ పరీక్షలు నిర్వహించగా, డీఎన్​ఏ పరీక్ష ద్వారా అరవింద్​ అని నిర్ధరణ జరిగింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అనంతరం స్వదేశంలో ఉన్న తల్లి, బంధువులు యువకుడి మృతదేహాన్ని తీసుకురావడానికి రెండు రోజుల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లారు. యువకుడి మృతిపై స్థానిక పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కేంద్ర అధికారులతో పాటు ఆస్ట్రేలియా ఉన్నతాధికారులతో మాట్లాడి అరవింద్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్​రెడ్డితో పాటు ఆ పార్టీ మహబూబ్​నగర్​ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఏర్పాట్లు చేస్తున్నారు.

మృత్యువు వెంటాడటం అంటే ఇదేనేమో - ఒక ప్రమాదం నుంచి బయటపడిన నిమిషాల్లోనే - మరో యాక్సిడెంట్​లో! - Zaheerabad Techi Died in USA

Last Updated : May 24, 2024, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.