Telangana Weather Report Upcoming 3 Days : రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆవర్తనం ఒకటి పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. రాష్ట్రంలో పలు జిల్లాలో వచ్చే మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని వెల్లడించింది. దీంతో పాటు రాష్ట్ర ప్రజలకు జాగ్రత్తలు తెలిపింది.
రానున్న మూడు రోజుల పాటు వర్షాలు పడే జిల్లాల వివరాలు :
తేదీ | వర్షం రకం | వర్షాలు పడే జిల్లాలు | గాలి వేగం |
15/05/2024 | తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు | ఆదిలాబాద్, కుమురం భీం- ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాల పల్లి, ములుగు, భద్రాద్రి కొత్త గూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్గాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట్, జోగులాంబ గద్వాల్ | గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల |
16/05/2024 | తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు | ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాల పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్గాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి | గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల |
17/05/2024 | ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు | ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల , నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, మేడ్చల్ మల్గాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి | గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల |
Young Man Died due to Lightning in Nalgonda : నల్గొండ జిల్లాలో పిడుగు పడి ఓ యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. త్రిపురారం మండలంలో నీలయాయి గూడెంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడింది. ఈ సమయంలో క్రికెట్ ఆడుతున్న యువకులు చెట్టు కిందకి పరిగెత్తారు. అనంతరం ఆ చెట్టు మీద పిడుగు పడడంతో మర్రి రుషి (20) అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని మిర్యాలగూడ అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరో రెండ్రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - Telangana Weather Report
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - నేడు ఏడు జిల్లాలకు భారీ వర్ష సూచన - TELANGANA RAIN ALERT TODAY