ETV Bharat / state

తెలంగాణకు చల్లటి కబురు - రాగల 3 రోజులు భారీ వర్షాలు - ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు - Telangana Weather Report

Telangana Weather Report Today : రాష్ట్రంలో ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు హైదరాబాద్​ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాగల 3 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Hyderabad Rains
Today Weather Report
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 22, 2024, 4:22 PM IST

Telangana Weather Report Today : రాష్ట్రంలో రాగల 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్​లో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.

Next Three Days Rains in Telangana : ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ జిల్లాలకు మూడు రోజులు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

IMD Yellow Warnings are Issued in Telangana : ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లతో మునిగిపోయే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్​ లేని ప్రాంతాల వైపు వెళ్లాలని సూచించింది. వర్షాలు ఎక్కువగా ఉంటే కొన్ని గంటల పాటు విద్యుత్​ ఆగిపోయే అవకాశం ఉందని పేర్కొంది. అవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రాకుండా ఉండాలని వివరించింది.

ఐఎండీ ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాలకు వడగాలుల హెచ్చరికలు - IMD issued yellow alert

Today Weather Report in Telangana : మూడు రోజుల పాటు రాష్ట్రంలో సుమారు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశలున్నాయని వాతావరణ శాఖ సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం వీచిన ద్రోణి గాలి విశ్చితి ఈరోజు దక్షిణ ఛత్తీస్​గఢ్​ నుంచి విదర్భ, మరత్వాడ - అంతర్గత కర్ణాటక వద్ద కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం మీదుగా దక్షిణ కేరళ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని సంచాలకులు తెలిపారు.

హైదరాబాద్‌ శివారులో వర్ష బీభత్సం - పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు - Rain in Telangana

రాష్ట్ర ప్రజలకు ఐఎండీ గుడ్​న్యూస్​ - రాగల మూడు రోజులు విస్తారంగా వర్షాలు! - Rainfall Alert in Telangana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.