ETV Bharat / state

శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్​ వే, బోట్​ జర్నీ! - తెలంగాణ టూరిజం సూపర్​ ప్యాకేజీలు! - Telangana Tourism Srisailam Tours - TELANGANA TOURISM SRISAILAM TOURS

Telangana Tourism: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. శ్రీశైలంలోని పలు ప్రదేశాలను చూసేందుకు తెలంగాణ టూరిజం ఓ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Telangana Tourism
Telangana Tourism Srisailam Tour Packages (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 28, 2024, 3:07 PM IST

Telangana Tourism Srisailam Tour Packages: ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు చూసేందుకు అందుబాటు ధరల్లోనే పలు ప్యాకేజీలను తెలంగాణ టూరిజం ఆపరేట్​ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. శ్రీశైలం చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..

శ్రీశైలంలోని పలు ప్రదేశాలను చూసేందుకు తెలంగాణ టూరిజం డైలీ శ్రీశైలం టూర్​(Daily Srisailam Tour) పేరుతో ప్యాకేజీ ఆపరేట్​ చేస్తోంది. ఈ ప్యాకేజీ 1 రాత్రి, 2 పగళ్లు కొనసాగుతుంది. ప్రతి రోజూ ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. శ్రీశైల దర్శనంతోపాటు పాతాళగంగ, పాలధార, పంచధార, శ్రీశైలం డ్యామ్​, శిఖరం సహా పలు ప్రదేశాలు చూడొచ్చు.

ప్రయాణ వివరాలివే:

  • మొదటి రోజు హైదరాబాద్‌లోని పర్యాటక భవన్ నుంచి 8:30 గంటలకు బస్సు బయలుదేరుతుంది. అక్కడి నుంచి బషీర్​బాగ్​ చేరుకుని ఉదయం 9 గంటలకు శ్రీశైలానికి జర్నీ స్టార్ట్ అవుతుంది. మార్గం మధ్యలో లంచ్​ ఉంటుంది.​ భోజనం త‌ర్వాత సాక్షి గణపతి ఆలయాన్ని ద‌ర్శించుకుంటారు. సాయంత్రం 5:00 గంటలకు శ్రీశైలం చేరుకుని.. నేరుగా హోటల్‌కు వెళ‌తారు. శ్రీశైలంలోనే రాత్రి బ‌స ఉంటుంది. (శ్రీశైలం హోటల్లో దుప్పట్లు అందించరు. పర్యాటకులు సొంతంగా దుప్పట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది.)
  • రెండో రోజు ఉదయం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం అనంత‌రం బ్రేక్​ఫాస్ట్​ ఉంటుంది. తర్వాత హోటల్ నుంచి చెక్​ అవుట్ త‌ర్వాత రోప్ వేకు వెళ్తారు. ఈ జర్నీ అద్భుతంగా ఉంటుంది. పాతాళగంగ, పాలధార, పంచధార, హైడ్రో‌ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, శ్రీశైలం డ్యామ్, శిఖరం.. త‌దిత‌ర ప్రాంతాల‌ను చూస్తారు. అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు హైదరాబాద్‌ చేరుకోవడంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ ధరలు చూస్తే :

  • ఏసీ బస్ ప్యాకేజీ అయితే పెద్దలకు రూ.2,400, పిల్లలు (5 నుంచి 12సంవత్సరాలు) రూ.1920 చెల్లించాల్సి ఉంటుంది.
  • నాన్ AC బస్ ప్యాకేజీలో పెద్దలకు రూ.2000, పిల్లలకు రూ.1600గా నిర్ణయించారు.
  • ఈ టూర్​కు సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

సూపర్ టూర్ : బొగత అందాలు చూడాలంటే ఇటు.. నాగార్జున సాగర్​ చూడాలంటే అటు.. తెలంగాణ టూరిజం ఒక్కరోజు ప్యాకేజీలు!

హైదరాబాద్ – శ్రీశైలం- సోమశిల టూర్​ ప్యాకేజీ:

శ్రీశైలానికి మరో ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. హైదరాబాద్ – శ్రీశైలం- సోమశిల (Hyderabad – Srisailam – Somasila) పేరుతో తెలంగాణ టూరిజం ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీలో సోమశిల, శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి ద‌ర్శ‌నం.. త‌దిత‌ర పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండ‌గా.. ఇది 1 రాత్రి, 2 రోజులు కొనసాగుతుంది.

సోమశిల ప్రయాణం సాగుతుంది ఇలా..

  • మొదటి రోజు హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 9:00 గంటలకు బషీర్‌బాగ్‌ నుంచి బస్సు బయలుదేరుతుంది. మార్గమధ్యలో లంచ్​ ఉంటుంది.​ భోజనం త‌ర్వాత సాక్షి గణపతి ఆలయాన్ని ద‌ర్శించుకుంటారు. సాయంత్రం శ్రీశైలం చేరుకుని.. బస కోసం నేరుగా హోటల్‌కు వెళ‌తారు. శ్రీశైలంలోనే రాత్రి బ‌స ఉంటుంది. (పర్యాటకులు సాయంత్రం లేదా తెల్లవారుజామున దర్శనం చేయవలసి ఉంటుంది.)
  • రెండో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత ఉదయం 9 గంటలకు శ్రీశైలం నుంచి బోట్​ జర్నీ ద్వారా సోమశిలకు ప్రయాణం ఉంటుంది. అక్కడ పలు ప్రదేశాలను చూడవచ్చు. తిరుగు ప్ర‌యాణంలో సాయంత్రం 5 గంటలకి సోమశిల నుంచి బస్సు అందుబాటులో ఉంటుంది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

ధరలు చూస్తే:

  • హైదరాబాద్ - శ్రీశైలం - సోమశిల టూరిజం ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 4,999గా నిర్ణయించారు. పిల్లలకు రూ. 3,600గా ఉంది.

"అల పాపికొండల్లో విహరిద్దామా" - తక్కువ ధరలో తెలంగాణ టూరిజం అద్దిరిపోయే ప్యాకేజీ! -

తెలంగాణ టూరిజం స్పెషల్​ ప్యాకేజీ - యాదాద్రితో పాటు మరో 2 ప్రదేశాలు - టూర్‌ పూర్తి వివరాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.