ETV Bharat / state

2 నెలల్లో రాష్ట్ర ఖజానాకు రూ.22 వేల కోట్లకు పైగా ఆదాయం - కాగ్​​ రిపోర్ట్​లో వెల్లడించిన సర్కార్ - TELANGANA INCOME TILL MAY - TELANGANA INCOME TILL MAY

Telangana Revenue : తెలంగాణ ప్రభుత్వానికి 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలల్లో రూ.23,147 కోట్ల ఆదాయం సమకూరింది. పన్నుల ద్వారా రూ.22,419 కోట్లు రాగా, రూ.728 కోట్లు పన్నేతర ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరం మే నెల వరకు పన్నుల ద్వారా రూ.20,097 కోట్ల ఆదాయం వచ్చింది. నిరుడితో పోలిస్తే ఈ ఏడాది రూ.2,400 కోట్ల ఆదాయం పెరిగింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - కాగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదాయ, వ్యయ వివరాలు సమర్పించింది.

Telangana State Income Till May 2024
Telangana State Income Till May 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 29, 2024, 7:24 AM IST

Updated : Jun 29, 2024, 8:06 AM IST

Telangana State Income Till May 2024 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో రాష్ట్ర ఖజానాకు పన్ను ఆదాయం రూ.22 వేల కోట్లకు పైగా సమకూరింది. నిరుటితో పోలిస్తే మే నెల వరకు రూ.2 వేల 400 కోట్ల వరకు పెరుగుదల ఉంది. జీఎస్టీ ద్వారా అత్యధికంగా రూ.8 వేల 87 కోట్లు రాగా, అమ్మకం పన్ను రూపంలో రూ.5 వేల 459 కోట్లు ఖజానాకు చేరాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఒక్క రూపాయి కూడా రాలేదు. ఏప్రిల్, మే నెలల్లో రూ.7 వేల 386 కోట్ల అప్పు తీసుకున్న సర్కార్, రూ.23 వేల కోట్లకు పైగా వ్యయం చేసింది.

2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో రాష్ట్ర ఖజానాకు రూ.23 వేల 147 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అందులో పన్నుల ద్వారా వచ్చిన మొత్తం రూ.22 వేల 419 కోట్లు కాగా, పన్నేతర ఆదాయం రూ.728 కోట్లుగా ఉంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - కాగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదాయ, వ్యయ వివరాలు సమర్పించింది. గత ఆర్థిక సంవత్సరం మే నెల వరకు పన్నుల ద్వారా రాష్ట్రానికి రూ.20 వేల 097 కోట్లు వచ్చాయి.

ఈ ఏడాది రెండు నెలల్లో పన్ను ఆదాయం నిరుడితో పోలిస్తే రూ.2 వేల 400 కోట్లు పెరిగింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో పన్ను ఆదాయం స్వల్పంగా తగ్గింది. పన్నుల రూపంలో ఏప్రిల్‌లో ఖజానాకు రూ.11 వేల 464 కోట్లు రాగా, మే నెలలో ఆ మొత్తం రూ.10 వేల 954కు తగ్గింది. అత్యధికంగా జీఎస్టీ ద్వారా రూ.8 వేల 187 కోట్లు రాగా, అమ్మకం పన్ను రూపంలో రూ.5 వేల 459 కోట్లు సమకూరాయి.
Telangana Debts in 2022-23 : పెరుగుతున్న రుణభారం.. 2022-23లో రూ.20 వేల కోట్ల మార్కు దాటిన అప్పు

ఎక్సైజ్ పన్నుల రూపంలో రూ.3 వేల 321 కోట్లు, స్టాంపులు - రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.2 వేల 189 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాగా రూ.1,817 కోట్లు ఖజానాకు చేరాయి. ఇతర పన్నుల రూపంలో మరో రూ.1,443 కోట్లు వచ్చాయి. ఏప్రిల్, మే నెలల్లో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఒక్క రూపాయి కూడా నిధులు సమకూరలేదు. ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా రూ.7 వేల 386 కోట్లు సమకూర్చుకుంది. అన్ని రకాలుగా ఖజానాకు రూ.30 వేల 534 కోట్లు రాగా, అందులో ప్రభుత్వం రూ.28 వేల 493 కోట్లు ఖర్చు చేసింది.

మే నెల వరకు వడ్డీల చెల్లింపుల కోసం రూ.3 వేల 729 కోట్లు, వేతనాల కోసం రూ.7 వేల 572 కోట్లు వ్యయం చేసింది. పింఛన్లపై రూ.2 వేల 627 కోట్లు, రాయితీలపై రూ.2 వేల 081 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. మూలధన వ్యయం కింద రూ.5 వేల 017 కోట్లను ప్రభుత్వం వ్యయం చేసింది. రంగాల వారీగా చూస్తే సాధారణ రంగంపై రూ.9 వేల 330 కోట్లు, సామాజిక రంగంపై రూ.8 వేల 963 కోట్లు, ఆర్థిక రంగంపై రూ.10 వేల 199 కోట్లు ఖర్చు పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో ప్రాథమిక లోటు రూ.3 వేల 651 కోట్లు కాగా, ద్రవ్యలోటు రూ.7 వేల 380 కోట్లుగా నమోదైంది. ఏప్రిల్ నెలలో రెవెన్యూ మిగులు రూ.1020 కోట్లుగా చూపిన ప్రభుత్వం, మే నెల ముగిసే నాటికి రెవెన్యూ లోటు రూ.328 కోట్లుగా పేర్కొంది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సర్కార్​ ఫోకస్​ - శాసనసభ వేదికగా లెక్కతేల్చేందుకు సిద్ధం

Last Updated : Jun 29, 2024, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.