ETV Bharat / state

తెలంగాణలో సరికొత్త దళం - విపత్తు సమయాల్లో ఇక క్షణాల్లో సాయం! - TELANGANA SDRF SERVICES START TODAY

2 వేల మంది సిబ్బందితో ఏర్పాటవుతోన్న ఎస్‌డీఆర్‌ఎఫ్‌ - ఎస్‌డీఆర్‌ఎఫ్‌ను తీర్చిదిద్దేందుకు రూ.35.03 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం - అధునాతన పరికరాలు, కొత్త అగ్నిమాపక వాహనాలు కొనుగోలు

Telangana SDRF Services
Telangana SDRF Services (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 6, 2024, 1:35 PM IST

Telangana SDRF Services : రాష్ట్రంలో సరికొత్త దళం అనేక ఆధునిక హంగులతో అందుబాటులోకి రానుంది. జాతీయ విపత్తు స్పందన దళం తరహాలో తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF) రంగంలోకి దిగనుంది. భారీ అగ్నిప్రమాదాలు, వరదలు, భూకంపం వంటి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసరం సహాయ చర్యలు చేపట్టడానికి ఈ దళం సిద్ధమవుతోంది. తెలంగాణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దాదాపు 2000 మంది సిబ్బందితో ఇది ఏర్పాటవుతోంది. అగ్నిమాపక శాఖలోని ఫైర్‌స్టేషన్లు ఇక నుంచి ఎస్​డీఆర్​ఎఫ్​ స్టేషన్లుగా మార్పు చెందనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 137 ఫైర్‌స్టేషన్‌లలోని దాదాపు 1000 మంది సిబ్బందితో పాటు తెలంగాణ ప్రత్యేక పోలీసు విభాగానికి చెందిన పది కంపెనీలతో కూడిన వెయ్యి మంది సిబ్బంది ఈ దళంలో విధులు నిర్వర్తించనున్నారు.

రూ.35.3 కోట్ల మంజూరు : రాష్ట్రంలో గత జూలై, ఆగస్టు నెలల్లో సంభవించిన భారీ వరదల్లో పలు ప్రాంతాలు నీట మునిగిన క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఎన్​డీఆర్​ఎఫ్​ తరహాలో సుశిక్షితులైన సిబ్బందితో కూడిన దళం అవసరమని భావించి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఎస్​డీఆర్​ఎఫ్​ను తీర్చిదిద్దడంతో పాటు ఆధునీకరించేందుకు ప్రభుత్వం రూ.35.3 కోట్లను గత అక్టోబరులో మంజూరు చేసింది. ఈ నిధులతో అధునాతన పరికరాలు, కొత్త అగ్నిమాపక వాహనాలు కొనుగోలు చేయడంతో పాటు సిబ్బందికి శిక్షణ ఇప్పించారు.

దేశ నలుమూల శిక్షణ : ఇందులో భాగంగానే 1000 మంది అగ్నిమాపక సిబ్బందికి ఎస్​డీఆర్​ఎఫ్​ ప్రాథమిక కోర్సుల్లో శిక్షణ ఇప్పించారు. రెండు వందల మంది చొప్పున సిబ్బందికి ఐదు బ్యాచుల్లో ఎనిమిది వారాల పాటు తమిళనాడులోని అరక్కోణం, మహారాష్ట్రలోని పుణె, గుజరాత్​లోని వడోదర, ఒడిశాలోని ముందాళి, ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణ వంటి తదితర ప్రాంతాల్లో ఎన్​డీఆర్​ఎఫ్​ కేంద్రాల్లో శిక్షణ తీసుకున్నారు. టీజీఎస్పీ సిబ్బంది త్వరలోనే శిక్షణ తీసుకోనున్నారు.

ఎస్​డీఆర్​ఎఫ్​కు కేటాయించిన పరికరాలు : ఎస్​డీఆర్​ఎఫ్​ అమ్ములపొదిలో పలు అస్త్రాలు ఉన్నాయి. విపత్తు నిర్వహణ సిబ్బంది కోసం కొత్తగా 20 బస్సులు, ట్రక్కులు, బొలేరోలతో పాటు 40 వాటర్‌ బోట్‌లు కొనుగోలు చేశారు. అగ్నిప్రమాదాల్లో సహాయ చర్యల కోసం సిబ్బందికి శిరస్త్రాణాలు, చేతి గ్లౌజ్‌లు, కంటి అద్దాలు, రెఫ్లెక్టివ్‌ టేప్‌లు, సేఫ్టీషూ, మెడికల్‌ ఫస్ట్‌ రెస్పాండర్‌ కిట్‌లను సమకూర్చారు. వరదనీటిలో సహాయ చర్యల కోసం సిబ్బంది ధరించేందుకు వాటర్ ప్రూఫ్‌ జాకెట్లు, ట్రౌజర్లు, బెర్ముడా, డుంగారి డ్రెస్‌, ఎల్​ఈడీ హెడ్​లైట్​తో కూడిన హెల్మెట్​, ఫేస్​ షీల్డ్​, ఫేస్​ మాస్క్ వంటి అధునాతన పరికరాలు కొనుగోలు చేశారు.

రూ.80 వేల విలువ చేసే డిస్ట్రెస్​ సిగ్నల్​ యూనిట్​ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సహాయచర్యల్లో ఉన్న సిబ్బంది అపస్మారక స్థితిలోకి వెళ్తే ఈ పరికరం రక్షణ కల్పిస్తోంది. దీన్ని ధరించిన సిబ్బంది అచేతనంగా పడిపోతే వెంటనే గుర్తించి బయట ఉన్న వారికి సంకేతాలు పంపుతుంది. దీనికి ఉన్న ఎల్​ఈడీ లైట్ల కారణంగా చీకట్లో పడిపోయినా సులభంగా గుర్తించవచ్చు. నేడు సీఎం రేవంత్​ రెడ్డి ఎస్​డీఆర్​ఎఫ్​ను ప్రారంభించనున్నారు.

అగ్నిమాపక శాఖ బలోపేతానికి రంగం సిద్ధం - ఆధునీకీకరణ పథకం కింద భారీగా కేంద్ర నిధులు - Telangana Govt On Fire Department

వరద ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన - విపత్తు నష్టంపై ఆరా - Central Team Visit telangana

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.