Telangana Rajya Sabha Elections 2024 : తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగియనుండటంతో ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సీఈసీ సిద్ధమైంది. 15వ తేదీ దాకా నామినేషన్ల స్వీకరణ, 16న పరిశీలన, 20వ తేదీ దాకా నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ ఆవరణలో పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఓట్లు లెక్కించి విజేతలెవరో ప్రకటిస్తారు. అసెంబ్లీలో సభ్యుల సంఖ్యా బలం రీత్యా కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లు, బీఆర్ఎస్కు ఒక స్థానం దక్కే ఛాన్స్ ఉంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసు విచారణ ఈ నెల 14కి వాయిదా
Rajya Sabha Elections 2024 in Telangana : రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను మంగళ లేదా బుధవారం పార్టీ అధిష్ఠానం ప్రకటించనుంది. ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ప్రకారం రెండు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) నుంచి ఒక అభ్యర్థిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు ప్రచారాలు జరుగుతున్నాయి.
ఏఐసీసీ కోశాధికారి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు, కేంద్ర మాజీమంత్రి అజయ్ మాకెన్‌ను తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాలని పార్టీ యోచిస్తున్నట్లు సీనియర్ నేతలు తెలిపారు. ఆయన ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యవహారాలను పర్యవేక్షించారు. ఈ నెల 15న పార్టీ సమావేశం కోసం అజయ్ మాకెన్ హైదరాబాద్ వస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను తెలంగాణ అభ్యర్థిగా ఎంపిక చేస్తే అదే రోజు నామినేషన్ కూడా వేస్తారని పార్టీ వర్గాలు తెలిపుతున్నాయి.
Telangana Congress Rajya Sabha Candidates : చివరి క్షణంలో ఎలాంటి మార్పులు జరగకపోతే ఆయనకే టికెట్ ఇవ్వవచ్చని కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇక రాష్ట్ర కోటా అభ్యర్థిగా తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌లో పలువురు సీనియర్ నేతలు పట్టుబడుతున్నారు. అజయ్ మాకెన్ జనరల్ కేటగిరీకి చెందిన వారు కాబట్టి రాష్ట్ర కోటాలో వెనుకబడిన వర్గాలకు చెందిన వారికి టికెట్ ఇస్తే బాగుంటుందని పార్టీ కసరత్తులు చేస్తోంది. ఈ కోటాలో మాజీ ఎంపీ వీహెచ్‌తోపాటు, పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్, మాజీ ఉపాధ్యక్షుడు నాగయ్య తదితరులు అడుగుతున్నారు. మరోవైపు మాజీ ఎంపీ రేణుకాచౌదరి, మాజీ మంత్రులు జానారెడ్డి, చిన్నారెడ్డి తదితరులు ప్రయత్నాలు చేస్తున్నారు.
'గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియామకానికి మాకు అన్ని అర్హతలూ ఉన్నాయ్!'