ETV Bharat / state

కోతల్లేని సరఫరాపై విద్యుత్ శాఖ దృష్టి - ప్రణాళికబద్ధంగా వెళ్తున్న అధికారులు - TS Focused 24 Hours Power supply - TS FOCUSED 24 HOURS POWER SUPPLY

24 Hours Power supply in Telangana : కోతల్లేని సరఫరాపై విద్యుత్ శాఖ దృష్టి సారించింది. నిరంతర విద్యుత్ సరఫరా కోసం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ఈదురు గాలులు, భారీగా వర్షాలు కురుస్తుండటంతో విద్యుత్ తీగలపై చెట్లు కూలిపోవడం, ప్లెక్సీలు వచ్చి చిక్కుకోవడం వంటి ఘటనలు జరిగితే ఇబ్బందులు లేకుండా విద్యుత్ అధికారులు ప్రణాళికబద్దంగా ముందుకెళ్తున్నారు. విద్యుత్ సరఫరాకు అడ్డంకిగా ఉన్నవాటిని తొలగిస్తున్నారు.

24 Hours Power supply in Telangana
Power Interruption Works in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 27, 2024, 6:53 PM IST

Telangana Power Department focused on 24 Hours supply : విద్యుత్ వ్యవస్థ ఆవిర్భావం నుంచి కూడా మెయింటెనెన్స్ ప్రక్రియ కొనసాగుతోంది. విద్యుత్ వ్యవస్థలో సబ్ స్టేషన్స్ నిర్వహణ, లైన్స్, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ అనేది నిరంతర సాధారణ ప్రక్రియ. సంవత్సరంలో రెండు సార్లు విద్యుత్ వ్యవస్థలో మెయింటెనెన్స్ నిర్వహిస్తారు. వేసవి కాలంలో ఒకసారి, వర్షాకాలం ముందు ఒకసారి విద్యుత్ నిర్వహణ చేపడుతుంటారు.

Power Interruption Works in Telangana : నిర్వహణ, భద్రతా చర్యలో భాగంగా విద్యుత్ తీగలకు అడ్డుగా నున్న చెట్ల కొమ్మల తొలగింపు, ప్లెక్సీలు, బ్యానర్లను అధికార సిబ్బంది తొలగిస్తున్నారు. స్విచ్‌లు, ఇన్సులేటర్, కాంటాక్ట్స్ చెక్ చేయడం వదులుగా ఉన్న తీగలు సరి చేయడం, తీగలపై పడ్డ దారాలు, ఇతర వస్తువులు తొలగించడం వంటి పనులను అధికారులు నిరంతం చేపడుతుంటారు. ట్రాన్స్ ఫార్మర్​ల ఎర్తింగ్, సర్క్యూట్ బ్రేకర్‌లు, రిలేల పనితీరు తనిఖీ వంటి పనులు చేపడుతుంటారు.

TGSPDCL Action on Power Interruption : భాగ్యనగరంలో ఏ చెట్టు ఎప్పుడు కూలుతుందో తెలియడం లేదు. చిన్న గాలివచ్చినా తేలికపాటి వర్షం కురిసినా కనీసం పదిచెట్లు నేలకొరుగుతున్నాయి. ఆదివారం వచ్చిన ఈదురుగాలులకు భారీగా చెట్లు కూలిపోయాయి. రెండు వారాలుగా నగరంలో అడపాదడపా కురిసిన వర్షాలతో భారీగానే చెట్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎప్పటికప్పుడు మెయింటనెన్స్ చేయడం అనేది విద్యుత్ వ్యవస్థలో కీలకమైన అంశంగా మారిపోయింది.

అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్​ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి ఉత్తమ్ - Minister Uttam on Green Energy

Trees Removed Affected by Electricity : ఇప్పటికే సుమారు 2వేల పైచిలుకు ఫీడర్ల పరిధిలో విద్యుత్ తీగలకు అడ్డంకిగా ఉన్న వాటిని విద్యుత్ సిబ్బంది తొలగించారు. మరో వారం రోజుల్లో మిగిలిన రెండు వేల ఫీడర్ల పరిధిలో తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతిరోజు ఆయా ఫీడర్ల వారిగా పనులు చేపడుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కసారి నిర్వహణ చేపడితే మళ్లీ వర్షాకాలం పూర్తయ్యే వరకు దాదాపు ఇబ్బందులు తలెత్తవని అధికారులు చెబుతున్నారు.

"వర్షాకాలంలో విద్యుత్​ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలో భాగంగా అడ్డుగా ఉన్న చెట్లు నరికివేస్తున్నాం. కావాల్సిన వాటిని అడ్డు తీస్తున్నాం. ఆదివారం కురిసిన గాలి వానకు కొన్ని చోట్ల చెట్లు విరిగిపోయాయి."- విద్యుత్​ శాఖ అధికారి

కోతల్లేని సరఫరాపై విద్యుత్ శాఖ దృష్టి ప్రణాళికబద్ధంగా వెళ్తున్న అధికారులు (ETV Bharat)

చెట్లు విరిగిపడి విద్యుత్​ సరఫరాకు అంతరాయం - వీలైనంత త్వరగా​​ లైన్లను పునరుద్ధరించాలని సీఎండీ ఆదేశాలు - TGSPDCL CMD Review on Power Cuts

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.