Telangana Phone Tapping Case Updates : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బంజారాహిల్స్ పోలీసుల కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావు హైబీపీతో ఇబ్బంది పడుతున్నట్లుగా సమాచారం. ఉదయం నుంచి కూడా ఆయన హైబీపీతో ఇబ్బందిపడినట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫోన్ టాపింగ్ కేసులో రెండో రోజు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావును బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు విచారిస్తున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు.
Phone Tapping Case Investigation : ఫోన్ ట్యాపింగ్(Phone Tapping case) కేసులో ఆధారాలు ధ్వంసంపై దృష్టి సారించిన దర్యాప్తు బృందం ఆ దిశగా రాధాకిషన్ రావును ప్రశ్నిస్తోంది. ప్రణీతరావు తో కలిసి రాధా కిషన్ రావు హార్ట్ డిస్కులు ధ్వంసం చేయడంతో పాటు ఎస్ఐబీ కార్యాలయంలోని(SIB Office) మరిన్ని ఆధారాలు ధ్వంసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను మరింత లోతుగా విచారిస్తున్నారు. అయితే రెండో రోజు రాధా కిషన్ రావుకు బీపీ పెరగడంతో పోలీసులు పోలీస్ స్టేషన్‌కు వైద్యులను రప్పించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న వైద్యులు ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మలుపు తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - 'రాధాకిషన్ రావు చెప్పినట్లే చేశా'
దర్యాప్తులో వెలుగులోకి కొత్త విషయాలు : సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్ది విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో దర్యాప్తు బృందం ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా పలువురి రాజకీయ నేతల ఫోన్లపై ఇద్దరు కానిస్టేబుళ్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. విచారణ అనంతరం వీరి పాత్ర ఉందని తేలితే దర్యాప్తు బృందం అరెస్టు చేసే అవకాశం ఉంది.
ప్రణీత్‌రావుతో కలిసి రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్న కలిసి ట్యాపింగ్ ఆధారాలు ధ్వంసం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాధాకిషన్‌రావును ఆ దిశగా విచారిస్తున్నారు. హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు ఇప్పటికే గుర్తించారు. హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేయకముందు అందులో ఉన్న డేటాను ఎందులో అయినా నిక్షిప్తం చేశారా, ఎవరు ఒత్తిడితో ఈ తంతంగం నడిపారు, ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు, ఎంతమందిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు వంటి కోణాల్లో రాధాకిషన్‌రావు దర్యాప్తు బృందం విచారిస్తున్నట్లు సమాచారం.
గతంలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వివరాలను రాధాకిషన్‌రావుకు అందజేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో సీసీ కెమెరాలు, ఆడియో రికార్డింగ్స్ ఎవరు చెబితే ఏర్పాటు చేశారు అనే విషయంలోనూ దర్యాప్తు బృందం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్‌రావు పాత్ర ఉందని బయటపడడంతో అతని బాధితులు ఫిర్యాదు చేయడంతో వాటిని కూడా పోలీసులు పరిగణలోకి తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. రెండు రోజుల పోలీసు కస్టడీలో రాధాకిషన్‌రావు వెల్లడించిన అంశాల ఆధారంగా మరికొంత మందికి దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో కీలకంగా మారిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును హైదరాబాద్‌కు రప్పించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడుతున్న షాకింగ్ విషయాలు - టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో ఎన్నికల డబ్బు తరలింపు
హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసి మూసీ నదిలో పడేసి - ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్! -