Telangana Phone Tapping Case Updates : రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) కేసులో మరో ఇద్దరు ఏఎస్పీలు అరెస్టైన విషయం తెలిసిందే. డీఎస్పీ ప్రణీత్‌రావు విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగా వారిపై చర్యలు తీసుకున్నారు. ఈరోజు ఉదయం ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను నాంపల్లి కోర్టులో హాజరు పరుచగా వారిద్దరికి 14రోజుల రిమాండ్ విధించింది. అనంతరం వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా ఏప్రిల్ 6 వరకు ఇద్దరు పోలీసుల రిమాండ్‌లో ఉండనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు - ఇద్దరు అదనపు ఎస్పీల అరెస్ట్ - PRANEETH RAO CASE updates
SIB Ex DSP Praneeth Rao Case Updates : భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేశారు. తిరుపతన్న ఎస్ఐబీలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఐన్యూస్ మీడియా నిర్వాహకుడు శ్రవణ్‌రావు పాత్రలు ఉన్నట్లు గుర్తించారు. ప్రణీత్‌రావు అరెస్టుతో ఈ ముగ్గురూ దేశం దాటినట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు లుక్ఔట్ (Lookout Notice in Phone Tapping Case) నోటీసులు జారీ చేశారు.
శుక్రవారం రాత్రే ముగ్గురి నివాసాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు అనంతరం విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఐన్యూస్ శ్రవణ్ కుమార్ ఇంట్లో కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రవణ్‌రావు నైజీరియాకు వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గతంలో ఎస్ఐబీలో పనిచేసిన తొమ్మిది మంది విచారణకు రావాలని పోలీసులు నోటీసులిచ్చారు.
మొదట ఎస్ఐబీలో ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టైన ప్రణీత్‌రావును విచారిస్తున్న క్రమంలో ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం బహిర్గతమైంది. ఇదంతా అప్పటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే జరిగినట్లు విచారణ వెల్లడైంది. ఈ మేరకు ప్రణీత్‌రావు వాంగ్మూలంలో తెలిపాడు. మరోవైపు కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగించినట్లు తాజా దర్యాప్తులో బహిర్గతమైంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, ఉపఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలను లక్ష్యంగా చేసుకొని ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.