ETV Bharat / state

తెలంగాణ కొత్త లోగో ఇదే! - సోషల్ మీడియాలో ఫొటో వైరల్‌ - TELANGANA NEW EMBLEM PHOTO VIRAL - TELANGANA NEW EMBLEM PHOTO VIRAL

Telangana New Emblem : తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం అంటూ అనధికారికంగా సోషల్ మీడియాలో ఓ లోగో వైరల్ అవుతోంది. ఈ లోగోలో సింహాల రాజముద్ర పైన ఉండగా, కింద అమరవీరుల స్థూపం దానికి రెండు వైపుల వ్యవసాయాన్ని ప్రతిబింబించేలా వరి కంకులు అమర్చారు. ఈ నూతన లోగోను ఓసారి మీరూ చూసేయండి.

TELANGANA NEW EMBLEM PHOTO
TELANGANA NEW EMBLEM PHOTO (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 30, 2024, 12:54 PM IST

Updated : May 30, 2024, 1:06 PM IST

Telangana New State Logo : తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని వైభవంగా జరిపేందుకు ఇప్పటికే సర్కార్ రంగం సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్​గా రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం నిలవనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణను స్వల్ప మార్పులతో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి స్వరపరుస్తున్న విషయం తెలిసిందే. ఇక అధికారిక చిహ్నంలోనూ పలుమార్పులు చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందులో రాచరికపు గుర్తులు తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపింది.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అధికారిక చిహ్నం తుది రూపుపై తన నివాసంలో సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం రోజున సమీక్ష నిర్వహించి చిహ్నంలో మార్పులు చేర్పులపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో చర్చించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చిహ్నంలో రాచరికపు గుర్తులున్నాయని, వాటిని తొలగించాలని ఇప్పటికే రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రజలు, ప్రజా జీవితం, ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిహ్నాన్ని కూడా జూన్‌ 2వ తేదీన ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Telangana New Emblem Photo
నెట్టింట వైరల్ అవుతున్న తెలంగాణ కొత్త లోగో (Eenadu)

Telangana New Emblem Photo Viral : ఈ నేపథ్యంలోనే పలు గుర్తులను తొలగించి కొత్త లోగో తయారు చేసినట్లు సమాచారం. కళాకారుడు రుద్రరాజేశం ఇప్పటికే పలు డిజైన్లు రూపొందించి సీఎం రేవంత్ రెడ్డికి చూపించగా ఓ డిజైన్​ను ఫైనల్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే రాష్ట్ర చిహ్నానికి సంబంధించి ఇప్పుడు ఒక లోగో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే అధికారిక రాజముద్ర అంటూ నెట్టింట అనధికార ప్రచారం జరుగుతోంది.

ఈ కొత్త చిహ్నంలో నాలుగు సింహాల రాజముద్ర పైన ఉండగా కింద అమరవీరుల స్థూపాన్ని అమర్చారు. ఇక తెలంగాణ వ్యవసాయ రాష్ట్రం కాబట్టి ఆ రంగం ప్రతిబింబించేలా వరి కంకుల గుర్తులను అమరుల స్థూపానికి ఇరువైపులా ఉంచారు. ఇక ఈ లోగో జాతీయ జెండా రంగులో కనిపించేలా రూపొందించగా, తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలో రాసి ఉన్నాయి.

హైదరాబాద్ అనగానే అందరి మదిలో మెదిలేది చార్మినార్ - ఆ గుర్తును తొలగిస్తారా? : కేటీఆర్ - KTR on Telangana Emblem Change

Last Updated : May 30, 2024, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.