Telangana Man Returned From Cambodia : కాంబోడియాలో బందీగా మారి చిత్రహింసలు అనుభవించిన మహబూబాబాద్‌కు చెందిన ప్రకాశ్ ఎట్టకేలకు క్షేమంగా సొంత ఇంటికి చేరుకున్నాడు. విదేశాల్లో ఉపాధి కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఏజెన్సీ మోసపోయి ఆస్ట్రేలియా అని కాంబోడియాకు వెళ్లిన ప్రకాశ్ అక్కడ తీవ్రంగా చిత్రసింహలు అనుభవించాడు. ఆ మధ్యకాలంలో తాను అనుభవిస్తున్న హింసలను సెల్ఫీ వీడియోలో చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
వీడియో వైరల్ కాగా అతని కుటుంబ సభ్యులు ఎస్పీ రాంనాథ్ కేకన్‌కు ఫిర్యాదు చేయగా వారు కాంబోడియాలోని ఇండియన్ ఎంబసీతో మాట్లాడారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత కాంబోడియాలో ఉంటున్న తన స్నేహితుడికి చెప్పి సహాయం కోరింది. ప్రకాశ్ విషయం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయడు ఎంబసీ అధికారులతో మాట్లాడి అతని యోగక్షేమాలు తెలుసుకొని స్వదేశానికి రప్పించేందుకు కృషి చేశాడు. అందరి ప్రయత్నాలు ఫలించి ఎట్టకేలకు ప్రకాశ్ స్వదేశానికి తిరిగి వచ్చాడు.
తనను ఇక్కడికి తీసుకురావడానికి సహకరించిన అధికారులు, ప్రజా ప్రతినిధులకు, ఎంబసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపాడు. తనను మోసం చేసిన ఏజెన్సీపై కేసు పెట్టినట్లు చెప్పాడు. కాంబోడియాలో తన లాంటివారు 5వేల మందికి పైగా ఉన్నారని, వారంతా వెంటనే మానవ హక్కుల కమిషన్‌కు, భారత ఎంబసీ అధికారులకు తెలియజేస్తే స్వదేశానికి పంపించేందుకు సహాయం చేస్తారని సూచించాడు. ఎవరు సైబర్ నేరాలు, వలపు వలల విసిరి భారతీయులను మోసం చేయవద్దని విజ్ఞప్తి చేశాడు.
అసలు ఏం జరిగిందంటే : ప్రకాశ్ బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ కొంతకాలం ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఈ సమయంలోనే ఓ ఏజెన్సీ ద్వారా ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు ఉన్నాయనే సమాచారం తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా, తమకు అంత స్తోమత లేదని చెప్పారు. వారు వద్దని చెప్పినా వినకుండా ఆస్ట్రేలియాకు బయలుదేరాడు. ఆ ఏజెన్సీ వారు మాత్రం అతడిని ఆస్ట్రేలియా తీసుకెళ్లకుండా కాంబోడియాలో వదిలేశారు.
అక్కడ వారు విద్యుత్ షాక్, ఇంజెక్షన్లు ఇవ్వడం వంటి చిత్రహింసలు పెడుతున్నారని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. అక్కడ నరకయాతన అనుభవిస్తున్నానని, వాళ్లు చెప్పిన పని చేయకపోతే కరెంట్ షాక్ ఇస్తున్నారని, ఆ బాధలు తట్టుకోలేక పోతున్నానంటూ బాధితుడు తన తమ్ముడికి వివరించాడు. అలాగే తనతో పాటు ఇంకా కొంతమంది పురుషులు, మహిళలు కూడా ఉన్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే తన అన్నను కాంబోడియా నుంచి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.
ఎన్‌ఆర్‌ఐపై దాడి చేసి విదేశీ కరెన్సీని దోచుకున్న ఆటో డ్రైవర్ గ్యాంగ్