ETV Bharat / state

నిరుద్యోగులకు బిగ్​ అలర్ట్​ - ఆ పోస్టులన్నీ ఇకపై గ్రూప్‌-3లోకి - Telangana Job Notification Reforms - TELANGANA JOB NOTIFICATION REFORMS

Telangana Job Calendar Alert : రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఏడాదికి సంబంధించిన ఉద్యోగ క్యాలెండర్‌ను ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి మరో కీలక అప్డేట్​ వచ్చింది. జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి పోస్టులు ఇకపై గ్రూప్‌-3లోకి రానున్నాయి. అవేకాకుండా మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నియామక సంస్థలు వెలువరించే ప్రకటనల్లో కీలక సంస్కరణలు చోటుచేసుకోనున్నాయి.

Telangana Job Calendar Alert
Telangana Job Notification Key Reforms (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 9, 2024, 7:43 AM IST

Telangana Job Notification Key Reforms : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర సర్కారు ప్రకటించిన ఉద్యోగ క్యాలెండర్‌కు అనుగుణంగా నియామక సంస్థలు వెలువరించే ప్రకటనల్లో కీలక సంస్కరణలు చోటుచేసుకోనున్నాయి. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఒకే విద్యార్హతలతో కూడిన పోస్టులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం, జనరల్‌ స్టడీస్‌ పరీక్ష (పేపర్‌-1) ఉమ్మడిగా నిర్వహించడం అందులో ముఖ్యమైనది.

టీజీపీఎస్సీతో సహా పోలీసు, గురుకుల, వైద్య రిక్రూట్​మెంట్​, డీఎస్సీ నియామక మండళ్ల మధ్య సమన్వయంతో నిర్ణీత గడువు లోగా పరీక్షలు పూర్తిచేయడం ఈ సంస్కరణల లక్ష్యమని ప్రభుత్వ వర్గాల సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఏడాదికి సంబంధించిన ఉద్యోగ క్యాలెండర్‌ను ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యాలెండర్‌లో పేర్కొన్న షెడ్యూలు ప్రకారం ఎగ్జామ్స్​ పూర్తిచేసే కార్యాచరణ మొదలైంది.

TG Job Notification Upcoming Changes : ఈ ఏడాది వెలువరించిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ప్రకారం మెయిన్​ పరీక్షల సమయానికి మరో గ్రూప్‌-1 ప్రకటన వెలువడనుంది. 2022లో వెలువడిన గ్రూప్‌-2 ఉద్యోగ నోటిఫికేషన్​ పరీక్షలు డిసెంబరులో జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి తేదీలు త్వరలో వెలువడే అవకాశాలున్నాయి.

ప్రభుత్వ​ విభాగాలు, సొసైటీలు, కార్పొరేషన్లలో గ్రూప్‌-3, 4 ఆయా కేటగిరీ పోస్టులన్నింటికీ కలిపి ఇక నుంచి గ్రూప్‌-3 నోటిఫికేషన్‌ రానుంది. గతంలో జిల్లా స్థాయి గ్రూప్‌-4 పోస్టులకు ఇంటర్మీడియట్, రాష్ట్ర స్థాయి గ్రూప్‌-3 పోస్టులకు డిగ్రీ ఎలిజిబిలిటీ ఉండేది. ప్రెజెంట్​ గ్రూప్‌-3, 4 పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హతగా ఉంది.

విద్యార్హతలు, పోస్టు హోదా ఒకటే కావడంతో జూనియర్‌ అసిస్టెంట్‌ లెవల్ పోస్టులన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకురానున్నారు. ఈ పోస్టులకు గ్రూప్‌-3 కేటగిరీ కింద టీజీపీఎస్సీ ఉమ్మడిగా పరీక్ష నిర్వహిస్తుంది. పరీక్షలో మార్కులు, ప్రతిభ ఆధారంగా క్యాండిడేట్స్​ తమకు ఇష్టమైన ఐచ్ఛికం ఇచ్చి గ్రూప్‌-3 కేటగిరీకి వెళ్లాలా? లేదా గ్రూప్‌-4 కేటగిరీకి వెళ్లాలా? అనేది నిర్ణయించుకునే అవకాశాన్ని కల్పించనుంది. తద్వారా వేగంగా నియామకాలు పూర్తిచేయాలని యోచిస్తోంది.

అటవీ రేంజ్‌ అధికారులు​ పోస్టులు ఇకపై గ్రూప్‌-2లోకి : గ్రూప్‌-1 ప్రకటనతో కలిపి అటవీశాఖలోని అటవీ సహాయ సంరక్షకులు (అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌) పోస్టులకు ఉమ్మడిగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో వచ్చిన మార్కులు, ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను మెయిన్​ పరీక్షకు ఎంపిక చేస్తారు. అటవీశాఖ పోస్టుల భర్తీకి ప్రత్యేక అర్హతలు ఉంటాయి.

ఆ క్వాలిఫికేషన్ మేరకు ఆయా అభ్యర్థులకు ప్రత్యేక మెరిట్‌ జాబితాను వెలువరించి ప్రధాన పరీక్షలు నిర్వహిస్తారు. అటవీ రేంజ్‌ ఆఫీసర్​ పోస్టులను గ్రూప్‌-2లో అంతర్భాగం చేయనున్నారు. గ్రూప్‌-2 ఎగ్జామ్​లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎఫ్‌ఆర్‌వో పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

TG Job Notification 2024 : గ్రూప్‌-1, 2, 3 కేటగిరీల పరిధిలోకి రాని మిగతా ప్రొఫెషనల్‌ కేటగిరీలకు చెందిన గెజిటెడ్‌ స్కేలు పోస్టుల భర్తీని సైతం ఒకే గొడుగు కిందికి తీసుకురానున్నారు. కొన్ని పోస్టులకు ప్రత్యేక విద్యార్హతలు ఉంటాయి. ఆయా పోస్టులకు వేర్వేరు ప్రకటనలు ఇవ్వకుండా వాటన్నిటినీ ఒకే నోటిఫికేషన్‌ కిందకు తీసుకువస్తారు. ఉదాహరణకు హాస్టల్​ వెల్ఫేర్​ ఆఫీసర్, డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారులు, ఇతర ఉన్నతస్థాయి పోస్టులు ఉంటాయి.

ఆయా పోస్టులకు ఒకే నోటిఫికేషన్‌ ఇస్తారు. పేపర్‌-1 పరీక్షను కంబైన్డ్​గా నిర్వహిస్తారు. రిలేటడ్​ సబ్జెక్టుల స్పెషలైజేషన్‌ పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. తద్వారా సర్కార్​ ఉద్యోగాల నియామక కాలపరిమితి తగ్గుతుంది. అనంతరం ప్రతిభ ఆధారంగా మెరిట్‌ లిస్ట్​ ప్రకటించి, నియామకాలు వేగంగా పూర్తిచేసేందుకు వీలు కలుగుతుందనేది ప్రభుత్వ, నియామక సంస్థల యోచన.

తెలంగాణలో జాబ్​ క్యాలెండర్​ విడుదల - ఏ నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయంటే? - Telangana Job Calendar 2024

అక్టోబర్‌లో ఏఈఈ, నవంబర్‌లో టెట్‌ నోటిఫికేషన్‌ - జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించిన భట్టి - DY CM Bhatti Announces Job Calendar

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.