High Court Suspends Petition on KCR and Harish Rao : మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్‌లు కుంగిన ఘటనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను జనవరి 7వ తేదీకి వాయిదా వేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆర్దర్స్ సరిగా లేవని న్యాయమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తికి నోటీసులు జారీ చేసింది.
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగడంపై క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన భూపాలపల్లి కోర్టు కేసీఆర్, హరీశ్ రావుతో పాటు మరో ఆరుగురికి నోటీసులు జారీ చేసింది. నోటీసులపై కేసీఆర్, హరీశ్ రావులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారించిన కోర్టు, భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలు సరిగ్గా లేవని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచరాణను జనవరి 7కు వాయిదా వేసింది.
సవాల్ చేస్తూ పిటిషన్ : కాళేశ్వరం ప్రాజెక్టు భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వమే కారణమని, ప్రజాధనం భారీగా దుర్వినియోగం అయినందువల్ల దీనిపై సమగ్రమైన విచారణ చేపట్టాలని సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి 2023 నవంబరు 7న భూపాలపల్లి ప్రధాన మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ తమ పరిధిలోకి రాదంటూ జనవరిలో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు పిటిషన్ కొట్టివేయగా, దాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్ అప్పుడే భూపాలపల్లి జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో జిల్లా కోర్టు కేసీఆర్, హరీశ్ రావులకు నోటీసులు జారీ చేసింది.
ఆదేశాలు సస్పెండ్ : భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా కోర్టుకు విచారణ అర్హతలేదని హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన జస్టిస్ కె.లక్ష్మణ్ జిల్లా కోర్టు ఆదేశాలను సస్పెండ్ చేశారు. తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.
హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన కేసీఆర్, హరీశ్‌రావులు - ఎందుకంటే?