ETV Bharat / state

వివేకా హత్య కేసులో మాస్టర్ మైండ్ - పథక రచన, దాడిలోనూ కీ రోల్ - VIVEKA MURDER CASE UPDATES

ఉమాశంకరరెడ్డి బెయిలు పిటిషన్‌పై సీబీఐ వాదన

TG HC on Umashankar Reddy Petition
TG HC on Umashankar Reddy Petition (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 30, 2024, 9:37 AM IST

TG HC on Umashankar Reddy Petition : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యలో గజ్జల ఉమాశంకరరెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు వెల్లడించింది. సర్పంచి ఎన్నికకు సహకరించలేదని కక్ష పెంచుకున్న ఉమాశంకరరెడ్డి హత్యకు పథక రచనలో కీలకంగా వ్యవహరించడంతోపాటు ఆ ఘటనలో పాల్గొని వివేకాపై దాడికి కూడా పాల్పడ్డారని తెలిపింది. కేవలం జైలులో ఉన్నాడన్న కారణంగా నిందితులకు బెయిల్ మంజూరు చేయరాదని, బెయిల్ మంజూరుకు తగిన కారణాలను చూపాల్సి ఉందని వివరించింది.

ఈ కేసులో మూడో నిందితుడైన ఉమాశంకరరెడ్డి దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ మంగళవారం విచారణ చేపట్టారు. నిందితుడి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఉమాశంకరరెడ్డిని గుర్తించినట్లు వాచ్‌మన్‌ రంగన్న మూడుసార్లు వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. ఒక్కోసారి ఒక్కోలా చెప్పారని, మొదట బక్కగా ఉన్నారని, తరువాత ఫలానా రంగు చొక్కా వేశారని ఇలా భిన్నంగా చెప్పారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. హత్య తరువాత ఉమాశంకరరెడ్డి తనతోపాటు ద్విచక్రవాహనంపై వచ్చారంటూ రెండో నిందితుడైన సునీల్‌యాదవ్‌ నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చినట్లు ధర్మాసనానికి వివరించారు. అయితే ఆ ఘటన వీడియో ఫుటేజీలో పిటిషనర్‌ లేరని చెప్పారు.

Viveka Murder Case Updates : దస్తగిరి వాంగ్మూలంలో గంగిరెడ్డి తలుపు తీసి తమకు సహకరించారని పేర్కొన్నారని నిందితుడి తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. అయితే వాటిని బలవంతంగా తొలగించినట్లు ఉందని చెప్పారు. అందువల్ల ఆ వాంగ్మూలం మీద ఆధారపడకూడదని తెలిపారు. సాక్ష్యాల తారుమారు అన్న వాదనకు ఆస్కారం లేదని, బెయిల్ మంజూరు చేయాలని ధర్మాసనాన్ని కోరారు.

గొడ్డలితో వివేకా నుదుటిపై కొట్టారు : సీబీఐ తరఫు న్యాయవాది అనిల్‌ తల్వార్, వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫు న్యాయవాది ఎస్‌.గౌతం వాదనలు వినిపిస్తూ ఈ కేసులో రెండో నిందితుడు సునీల్‌ యాదవ్‌ ఉమాశంకరరెడ్డితో ద్విచక్రవాహనంపై వెళ్లినట్లు వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. వీడియో ఫుటేజీలోనూ దీనికి సాంకేతిక ఆధారాలు లభించాయని చెప్పారు. ‘డాగ్‌ స్క్వాడ్‌ కంటే ముందే ఉదయం 5 గంటలకే స్థానిక పోలీసులు వివేకా ఇంటికి చేరుకున్నారు. తలుపు లాక్‌ దెబ్బతిన్నట్లు ఏమీ లేదు. గంగిరెడ్డి తలుపు తెరిచి నిందితులకు సహకరించారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం వివేకా హత్యలో ఉమాశంకరరెడ్డి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆయన దస్తగిరి నుంచి గొడ్డలి తీసుకుని వివేకా నుదుటిపై కొట్టారు. రక్తపు మడుగులో ఉన్న ఆయణ్ని బాత్‌రూంలోకి లాక్కెళ్లారు.' అని న్యాయస్థానానికి వివరించారు.

'సర్పంచి ఎన్నికలో తనకు సహకరించాలన్న అభ్యర్థనను వివేకా తిరస్కరించారు. దీంతో ఆయనపై ఉమాశంకరరెడ్డి కక్ష పెంచుకుని హత్యకు సహకరించారు. హత్య జరిగిన రోజు వివేకా హైదరాబాద్‌ రావాల్సి ఉంది. అయితే ముఖ్యమైన వ్యవహారం ఉందంటూ ఆయణ్ని హైదరాబాద్‌ రాకుండా గంగిరెడ్డితో కలిసి అడ్డుకున్నారు. సునీల్‌యాదవ్‌ను కూడా ఉమాశంకర్‌రెడ్డే వజ్రాల వ్యాపారం పేరుతో వివేకాకు పరిచయం చేశారు. గంగిరెడ్డి, సునీల్‌యాదవ్‌లతో కలిసి ముందు వివేకా కుక్కను చంపారు. దస్తగిరి వాంగ్మూలాలను సుప్రీంకోర్టు కూడా ధ్రువీకరించింది. అందువల్ల వీటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. ఉమాశంకరరెడ్డిపై తీవ్ర ఆరోపణలున్నాయి’ అని ధర్మాసనానికి వివరించారు. అనంతరం ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.

వివేకా హత్య కేసు - సీబీఐ అధికారి రామ్‌సింగ్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ - HC on CBI SP Ram Singh Petition

వివేకా హత్యపై మాట్లాడొద్దన్న కడప కోర్టు తీర్పు ఏకపక్షం- ఉత్తర్వులపై సుప్రీం స్టే - Supreme Stay on Kadapa Court Orders

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.