ETV Bharat / state

రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లు పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు - TS High Court on ST Reservation

Telangana High Court on ST Reservation : తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లు పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సర్కార్ ఇచ్చిన జీవో 33పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌ 28కి హైకోర్టు వాయిదా వేసింది.

Telangana High Court on ST Reservation
Telangana High Court on ST Reservation (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 5, 2024, 12:00 PM IST

TS HC Notices to Govt on Increase in ST Reservation : రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై తెలంగాణ సర్కార్​కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ జీవో ఆధారంగా ఫిబ్రవరిలో జారీ చేసిన నోటిఫికేషన్‌ కింద గ్రూప్‌-1 నియామక ప్రక్రియ తుది తీర్పునకు లోబడి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ 2022లో జారీ చేసిన జీవో 33ను సవాలు చేస్తూ పి.శ్యాంసుందర్‌రెడ్డి, మరొకరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Telangana High Court on ST Reservations in Group-1 : దీనిపై జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫిబ్రవరి 19న టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 పోస్టుల భర్తీ ప్రక్రియకు నోటిఫికేషన్‌ జారీ చేసిందని తెలిపారు. ఇందులో ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతమని పేర్కొందని హైకోర్టుకు వివరించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రిజర్వేషన్లు 54 శాతానికి పెరిగాయని చెప్పారు.

చెరువుల కబ్జాతో ముప్పే - హైకోర్టుకు న్యాయమూర్తి లేఖ - స్వీకరించిన న్యాయస్థానం - Telangana HC on Pond Encroachments

సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇది రాజ్యాంగంలోని అధికరణ 14, 15, 16లకు విరుద్ధమని అన్నారు. సాధారణంగా ఒక వర్గానికి రిజర్వేషన్లను పెంచాలంటే సామాజిక వెనకబాటుతనంపై అధ్యయనం చేయాల్సి ఉందని, అలా చేయకుండానే తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా పెంచడం చెల్లదని వివరించారు. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో ఉన్న ఖాళీల్లో ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ల కేటాయింపును రద్దు చేసేలా టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్​ తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. అనంతరం వాదనలను విన్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ, న్యాయశాఖ, గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శులు, టీఎస్‌పీఎస్సీలకు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్‌ 28కి హైకోర్టు వాయిదా వేసింది.

ఒకటో తరగతికి కనీస వయసుపై పిల్ - కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు - HC NOTICES ON CLASS1 MINIMUM AGE

ఆరో తరగతి విద్యార్థిని లేఖకు స్పందించిన హైకోర్టు - బార్​ & రెస్టారెంట్​పై ప్రభుత్వానికి నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.