Telangana High Court Hearing AP Former CM Jagans Cases : ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్‌పై ఉన్న కేసుల గురించి దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీగా విచారించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్ కేసులపై గతంలో హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కోర్టులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను తెలంగాణ ధర్మాసనం 3 వారాలకు వాయిదా వేసింది.
సీబీఐ కోర్టులో జగన్ కేసుల రోజువారీ విచారణ : తెలంగాణ హైకోర్టు ఆదేశం - TG High Court Hearing Jagan Cases - TG HIGH COURT HEARING JAGAN CASES
Telangana High Court Hearing AP Former CM Jagans Cases: ఏపీ మాజీ సీఎం జగన్ కేసుల పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ చేసింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీ విచారణకు హైకోర్టు ఆదేశం జారీ చేసింది.
Published : Jul 3, 2024, 3:34 PM IST