TGPSC Group-1 Prelims Key Released 2024 : తెలంగాణలో 563 గ్రూప్-1 సర్వీసుల పోస్టులకు ఈనెల 9న టీజీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షకు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేయగా, 3.02 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఇవాళ పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. ఈనెల 17 సాయంత్రం 5 గంటల వరకు వరకు దీనిపై ఏదైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామని కమిషన్ పేర్కొంది. ఇందుకోసం తొలుత టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింక్ ద్వారా వ్యక్తిగత వివరాలను ధ్రువీకరించి, అభ్యంతరాలను ఆంగ్లంలో నమోదు చేయాలని తెలిపింది.
వాటికి తగిన రుజువులు, పుస్తక రచయిత పేరు, పుస్తకంలో పేజీ నంబర్, పత్రిక ఎడిషన్, పేజీ నంబర్, పబ్లిషర్ పేరు వెబ్‌సైట్ యూఆర్‌ఎల్ వివరాలను ఇవ్వాలని టీజీపీఎస్సీ పేర్కొంది. ఈ-మెయిల్, వ్యక్తిగత విజ్ఞాపనలు, ఇతర పద్ధతుల్లో వచ్చే, గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.
Group-1 Mains Exam Schedule Release : మరోవైపు టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 21 నుంచి ఆక్టోబర్ 27 వరకు వరుసగా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. పరీక్ష కేంద్రాలన్నీ హైదరాబాద్ (హెచ్‌ఎండీఏ పరిధి)లోనే ఉంటాయని తెలిపింది. ప్రతి పేపర్ కాలపరిమితి మూడు గంటలని, పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని వెల్లడించింది. ప్రతి పేపర్‌కు 150 మార్కులు ఉంటాయని వివరించింది. జనరల్ ఇంగ్లిష్ పేపరు పదోతరగతి స్థాయిలో ఉంటుందని, ఈ పరీక్షలో వచ్చిన మార్కులను ర్యాంకుల నిర్ధరణలో పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. పరీక్షల పూర్తిస్థాయి సిలబస్ కోసం 2024 ఫిబ్రవరి 19న జారీ చేసిన గ్రూప్-1 ఉద్యోగ ప్రకటన పరిశీలించాలని కమిషన్ సూచించింది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు విడుదల - క్వాలిఫై అయిన అభ్యర్థులు వీరే! - Group 2 Results
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ :
జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫయింగ్ టెస్ట్) – అక్టోబర్ 21
పేపర్-1 (జనరల్ ఎస్సే) – అక్టోబర్ 22
పేపర్-2 (హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ) – అక్టోబర్ 23
పేపర్-3 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గవర్నెన్స్) – అక్టోబర్ 24
పేపర్-4 (ఎకానమి అండ్ డెవలప్‌మెంట్) – అక్టోబర్ 25
పేపర్-5 (సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్‌ప్రిటేషన్) – అక్టోబర్ 26
పేపర్-6 (తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్) – అక్టోబర్ 27
గ్రూప్-1 మార్కుల వెల్లడికీ ఏపీపీఎస్సీ గోప్యత - APPSC RESTRICTIONS ON GROUP 1 MARKS