Telangana Group-1 Applications Deadline Ends Today : రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో 563 గ్రూప్-1 సర్వీసు పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ (TSPSC) నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగ ప్రకటన దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్లో అర్జీలు స్వీకరిస్తున్న కమిషన్ ఈనెల 14 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించింది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మరోసారి చేయాలని, కొత్తగా విద్యార్హత పొందిన ఉద్యోగార్థులు పోస్టులకు అర్జీ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించింది.
TSPSC Group-1 2024 : బుధవారం వరకు 2.70 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. 2022లో జారీ చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు 3.80 లక్షల మంది అర్జీ చేసుకున్నారని తెలిపింది. గతంలోనూ చివరి రోజున భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించింది. ఈసారి కూడా అలాగే జరగవచ్చని అంచనా వేస్తున్నామని వెల్లడించింది. అర్జీల్లో ఏమైనా పొరపాట్లు దొర్లితే మార్చి 23 ఉదయం 10:00 గంటల నుంచి మార్చి 27 సాయంత్రం 5:00 గంటల వరకు సరిచేసుకోవచ్చని వివరించింది. జూన్ 9న ప్రిలిమ్స్ , అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.
డిగ్రీ అర్హతతో EPFOలో 323 పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా!
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022 ఏప్రిల్ 26న 503 పోస్టుల భర్తీకి ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను
(Group-1 Notification 2024 ) ఇచ్చింది. అందుకనుగుణంగా ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా అభ్యర్థులను ఎంపిక కోసం టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. అదే సంవత్సరం అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. అనంతరం పేపర్ లీకేజీ కారణంగా ఆ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. తిరిగి 2023 జూన్ 11న రెండోసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా దాదాపు 2.32లక్షల మంది హాజరయ్యారు.
క్రియేటివ్ జాబ్స్ చేయాలా? డబ్బులు కూడా బాగా సంపాదించాలా? ఈ టాప్-5 కెరీర్ ఆప్షన్స్‌పై ఓ లుక్కేయండి!
అయితే ఈ పరీక్ష నిర్వహణలోనూ లోపాలున్నాయని, అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదని, పరీక్ష రోజున ఇచ్చిన హాజరు సంఖ్యకు, తుది కీ సమయంలో ఇచ్చిన హాజరు సంఖ్యకు పొంతన లేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ జరిపిన న్యాయస్థానం పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. దీనిని డివిజన్ బెంచ్ కూడా సరైనదేనని పేర్కొంది.
దీంతో టీఎస్‌పీఎస్సీ (TSPSC) న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ వేసింది. ఈ లోపు రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో సర్వోన్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్‌ను కమిషన్ వెనక్కి తీసుకుంది. అనంతరం ఇటీవలే 563 గ్రూప్-1 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది.
తెలంగాణలో ప్రభుత్వ కొలువుల జాతర షురూ - ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ ఫోకస్