Telangana Govt Cleared Farmers Crop Loan Waiver : ఎనిమిది నెలల క్రితం రాష్ట్రంలో పాలనాపగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షల్లోపు పంటరుణాల మాఫీతో చారిత్రక నిర్ణయం అమలు చేసింది. ఇందులో భాగంగా తొలి విడతగా లక్ష రూపాయల్లోపు మాఫీకి 11లక్షల 50వేల 193 మంది రైతుల ఖాతాలకు రూ.6వేల 98.93 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు తొలి విడతలో 10లక్షల 84వేల 50 కుటుంబాలకు లబ్ధి చేకూరినట్లు సర్కార్ వెల్లడించింది.
నియోజకవర్గాల వారీగా చూస్తే అందోలులో అత్యధికంగా 19వేల 186 కుటుంబాలకు చెందిన 20వేల 216 మంది రైతులకు రూ.107.83 కోట్లు జమయ్యాయి. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఒకే ఒక్క రైతుకు రూ.50,370 మాఫీ అయింది. నియోజకవర్గాల వారీగా అందోలు, హుస్నాబాద్, కల్వకుర్తి, దుబ్బాక, కొడంగల్, మునుగోడు, దేవరకొండ, తుంగతుర్తి, నారాయణఖేడ్, ధర్మపురి మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రంలోని 32 బ్యాంకులకు చెందిన 4, 276 శాఖలు, 9 డీసీసీబీలు, 61 సీడెడ్ సొసైటీల పరిధిలో రుణమాఫీ వర్తింపజేశారు.
జిల్లా | రుణ ఖాతాలు (వేలు) | జమ చేసిన మొత్తం (కోట్లు) |
నల్గొండ జిల్లా | 83,124 | రూ.454.49 |
సిద్దిపేట | 53,137 | రూ.290.24 |
సూర్యాపేట | 56,137 | రూ.282.98 |
సంగారెడ్డి | 51,167 | రూ.279.61 |
నాగర్‌కర్నూల్ | 59,172 | రూ.264.22 |
వికారాబాద్ | 47,048 | రూ.258.33 |
రంగారెడ్డి | 49,961 | రూ.258.19 |
మెదక్ | 48,864 | రూ.241.82 |
కామారెడ్డి | 50,097 | రూ.233.41 |
నిజామాబాద్ | 44,469 | రూ.225.62 |
మహబూబ్‌నగర్ | 39,380 | రూ.211.15 |
జగిత్యాల | 39,269 | రూ.207.99 |
యాదాద్రి | 37,285 | రూ.203.81 |
కరీంనగర్ | 37,745 | రూ.194.64 |
నారాయణపేట | 28,684 | రూ.165.45 |
మహబూబాబాద్ | 28,585 | రూ.159.65 |
వనపర్తి | 29,613 | రూ.156.92 |
మంచిర్యాల | 29,421 | రూ.154.39 |
జనగామ | 26,496 | రూ.149.69 |
పెద్దపల్లి | 29,725 | రూ.149.43 |
హనుమకొండ | 26,369 | రూ.145 |
గద్వాల | 24,398 | రూ.144.09 |
రాజన్న సిరిసిల్ల | 23,986 | రూ.136.36 |
వరంగల్ | 26,396 | రూ.134.20 |
భద్రాద్రి | 28,019 | రూ.132.07 |
కుమురం భీం | 22,000 | రూ.125.20 |
ఆదిలాబాద్ | 18,821 | రూ.120.79 |
జయశంకర్ భూపాలపల్లి | 17,054 | రూ.94.86 |
ములుగు | 12,997 | రూ.69.96 |
మేడ్చల్ | 2,781 | రూ.12.53 |
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అతి తక్కువగా 2,781 మంది రైతులకు రూ.12.53 కోట్లు మాఫీ అయింది. నియోజకవర్గాల వారీగా చూస్తే ఆందోలులో అత్యధికంగా 20,216 మంది రైతులకు రూ.107.83 కోట్లు జమ అయ్యాయి. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఒకే ఒక్క రైతుకు రూ.50,370 మాఫీ అయింది. కుత్బుల్లాపూర్‌లో 44 మందికి రూ.17 లక్షలు, వరంగల్ తూర్పులో 102 మందికి రూ.38 లక్షలు, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 112 మందికి రూ.42 లక్షలు రుణ విముక్తి కలిగింది. రాష్ట్రంలోని 32 బ్యాంకులకు చెందిన 4,276 శాఖలు, 9 డీసీసీబీలు, 61 సీడెడ్ సొసైటీల పరిధిలో రుణమాఫీ వర్తింపజేశారు.
ప్రభుత్వం రుణమాఫీ నిధులు మంజూరు చేయడంతో రైతులు ఆనందంతో కృతజ్ఞతలు చెబుతున్నారు. చాలాచోట్ల అన్నదాతలు ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి తమ కష్టాలను తీర్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సాయం వల్ల తమ గుండెలపై ఉన్న భారం ఒక్కసారిగా తీరిపోయిందన్నారు.