Telangana Govt Focus on Nominated Posts : రాష్ట్రంలో ఉన్న 12 నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఇప్పటికే పలు నామినేటేడ్ పదవులు భర్తీ చేయగా మిగిలిన 12 నామినేటెడ్ పదవులు భర్తీకి అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, లోకసభ ఎన్నికలతోపాటు నామినేటెడ్ పదవులు చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), రాష్ట్రవ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు భేటీ అయ్యారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన సమావేశంలో నామినేటెడ్ భర్తీ విషయమై జరిగిన చర్చలో 12 పదవులకు చెంది తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల లొల్లి - ఆచితూచి అడుగులు వేస్తున్న అధిష్ఠానం
Congress Govt Soon Fill ups Nominated Posts : రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పని చేసిన, అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని వారికి ఏఐసీసీ, పీసీసీ ఇచ్చిన హామీ మేరకు నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఆ మేరకు మూడు రకాల జాబితాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర నాయకత్వం ఒక్కొక్కటే నామినేటెడ్ పదవులను భర్తీ చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ (TSPSC) చైర్మన్ , సభ్యులు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం, వక్ఫ్ బోర్డు, రాష్ట్ర ప్రణాళిక బోర్డు చైర్మన్ పదవి, రాష్ట్ర ప్రెస్ అకాడమీ (Telangana Press Academy ) చైర్మన్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం వరుసుగా భర్తీ చేసుకుంటూ వస్తోంది.
దిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి - కౌన్సిల్ సభ్యుల ఎంపిక, నామినేటెడ్ పదవులపై అధిష్ఠానంతో చర్చ
ఇవి కాకుండా మరో 12 నామినేటెడ్ పదవులు భర్తీకి ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో శాసన సభ ఎన్నికల్లో టికెట్స్ రాని, అధికారంలోకి రావడానికి కృషి చేసిన నాయకులు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఇద్దరు ముస్లిం మైనారిటీ నాయకులు, ఒక మాజీ ఎమ్మెల్యే , రంగారెడ్డి జిల్లాకు చెందిన నాయకుడు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నాయకుడు తోపాటు ఇద్దరు మహిళా నాయకురాళ్లు , ఫ్రంటల్ ఆర్గనైజషన్స్ నాయకులు ఈ మొదటి జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.
వీలైనంత త్వరగా ఈ జాబితాలోని నాయకులకు పదవులు కట్టబెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవ్వరెవ్వరికి ఏ ఏ చైర్మన్ పదవులు ఇవ్వాలని సీఎం తనకున్న విచక్షణాధికారాలను వినియోగించుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సీఎం ఆ నాయకులకు చైర్మన్ పదవులను కట్టబెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కొత్త ఏడాదిలో నామినేటెడ్ పోస్టులు - అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసినవారికి ప్రాధాన్యం