Cultural Centers Shortage in Telangana : రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని సాంస్కృతిక కేంద్రాలు కళా విహీనంగా మారుతున్నాయి. నిత్యం కళాకారుల ప్రదర్శనలు, ప్రేక్షకులతో సందడిగా ఉండాల్సిన వేదికలు క్రమంగా బోసిపోతున్నాయి. నగరంలో రవీంద్రభారతి మినహా ప్రభుత్వ పరంగా చెప్పుకోదగ్గ పెద్ద వేదికలు లేవు. ఇందుకు ఉదాహరణే నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో ఉన్న తెలుగు లలిత కళాతోరణం. ఇదొక ఓపెన్ ఆడిటోరియం. క
ళాకారులు తమ లలిత కళలను ప్రదర్శనకు 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఈ వేదికను ఉచితంగా ఏర్పాటు చేశారు. మొదట్లో చాలా కాలం ఇక్కడ సినిమాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగేవి. కానీ కాలక్రమేణా సరైన వసతులు లేకపోవడంతో ఆదరించేవారు కరవయ్యారు. ఆడిటోరియంలో చాలా వరకు కుర్చీలు, సౌండ్ సిస్టమ్ సహా ప్రదర్శనలకు కావల్సినవి అందుబాటులో లేవు. దీంతో నిర్వహణ సరిగా లేకపోవడంతో కళాకారులు ప్రత్యమ్నాయ మార్గాలు చూసుకునేవారు.
హైదరాబాద్ మహా నగరంలో ఉన్న ఏకైక అతిపెద్ద కళా వేదిక రవీంద్రభారతి. రవీంద్రనాధ్ ఠాగూర్ శత జయంతి పురస్కరించుకొని 1961లో సర్వేపల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. 63 ఏళ్లుగా ఎంతో మంది కళాకారుల ప్రతిభను రవీంద్రభారతి ప్రపంచానికి పరిచయం చేసింది. శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం సహా అనేక కళారూపాలు ఈ వేదికపై ప్రదర్శించారు. ప్రపంచ తెలుగు మహాసభలకు వేదికగా నిలిచింది. అలాంటి రవీంద్రభారతి అరకొర వసతులు, సరిపడా నిధులు లేక అల్లాడిపోతుంది. కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు నామ మాత్రం రుసుముతో ప్రదర్శనలకు అనుమతి ఇస్తు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అంటున్నారు.
ఆ గ్రామంలో దేవుళ్లు - ఒకర్ని పిలిస్తే వంద మంది పలుకుతారు - Devudu Devudamma in Gollupalem
"రవీంద్ర భారతి అంటే సకల కళలకకు, సర్వ జనాలకు అనుకూలమైన వేదిక. ఇక్కడ అన్ని రంగాలకు చెందిన కార్యక్రమాలు జరుగుతాయి. అయితే గత 15ఏళ్లుగా ఒకే ధరకు వేదికను ఇస్తున్నాం. కళారంగాన్ని పోషించడానికి ఇది చేస్తున్నాం. హైదరాబాద్ కాకుండా వేరే ప్రాంతాల్లో కూడా వేదికలు అందుబాటులోకి రావాలి. ఇతర జిల్లాల్లో కూడా ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది." - మామిడి హరికృష్ణ, సంచాలకులు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ
ప్రభుత్వం నిర్ణయం కోసం వేచిచూస్తున్న అధికారులు : రవీంద్రభారతి నిర్వహణ భాషా సాంస్కృతిక శాఖకు కొంత కష్టమే అయినా ప్రభుత్వం ఇచ్చే నిధులతో నెట్టుకొస్తున్నారు. కళాకారులు, సాంస్కృతిక సంస్థలు ప్రైవేటు ఆడిటోరియంలో లక్షల రూపాయలు వెచ్చించి ప్రదర్శనలు ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వం ఇలాంటి వేదికలతో పాటు జిల్లా స్థాయిలో కూడా కళా క్షేత్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మామిడి హరికృష్ణ అభిప్రాయపడుతున్నారు. రవీంద్రభారతి ఆధునీకీకరణకు సంబంధించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామని, సానుకూల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొంటున్నారు.
ప్రతి జిల్లాలో సాంస్కృతిక నివేదికలు : నగరంలో సాంస్కృతిక వాతావరణాన్ని నలుదిక్కులా విస్తరింపజేయాలంటే రవీంద్రభారతి ఒక్కటే సరిపోదు. అలాంటి వేదికలను ప్రభుత్వం మరిన్ని నిర్మించాలని పలువురు సాంస్కృతిక విశ్లేషకులు కోరుతున్నారు. అలాగే జిల్లాలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్నవాటిని పూర్తి చేసి అవసరమైన చోట కొత్తవాటిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సరైన సాంస్కృతికి వేదికలు నిర్మిస్తే ప్రజాప్రయోజనంతో పాటు ఎంతో మంది కళాకారులను ప్రోత్సాహం దొరుకుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
'బండెనక బండి కట్టి - పదహారు బండ్లు కట్టి' - ఊరుఊరంతా మేడారం జాతరకు
మహిళల వేషధారణలో పురుషులు- అమ్మవారికి ప్రత్యేక పూజలు - Chamayavilakku festival kerala