Irrigation Sector Allocations in TG Budget 2024 : రాష్ట్రప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన పూర్తిస్థాయిలో బడ్జెట్‌లో సాగునీటి రంగంలో నూతన ప్రాజెక్టుల నిర్మాణం కంటే, తుది దశలో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి మొగ్గుచూపింది. గత ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టిందని, ఎన్డీఎస్‌ఏ సూచనల ఆధారంగా ప్రాజెక్టును కాపాడుకుంటామని ప్రకటించింది.
రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ - ఏయే శాఖకు ఎంత కేటాయించారంటే? - TELANGANA BUDGET 2024
నీటి పారుదల శాఖకు ఈ బడ్జెట్‌లో 22వేల 301 కోట్ల రూపాయలను కేటాయించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 73 ప్రాజెక్టులు చేపడితే 42 ప్రాజెక్టులు పూర్తికాగా, మరో 31 ప్రాజెక్టులు నిర్మాణదశలో ఉన్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు ప్రాజెక్టులను ఈ ఏడాది, 12 ప్రాజెక్టులను వచ్చే ఏడాది పూర్తి చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. దీంతోపాటు ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి నిపుణుల సూచనలకు మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాజెక్టుపై విచారణ కమిటీని నియమించామని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయన్నారు.రాష్ట్రంలో నూతన విద్యుత్ విధానాన్ని తీసుకొచ్చి, సౌరశక్తి రంగానికి ప్రాధాన్యమిస్తామని ప్రభుత్వం పేర్కొంది. విద్యుత్ రంగానికి ప్రభుత్వం 16వేల 410 కోట్ల రూపాయలు కేటాయించింది. నాణ్యమైన కరెంట్‌ను నిరంతరాయంగా అందించాలన్నది ప్రధాన లక్ష్యమని పేర్కొంది.
పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా సరఫరాలో నష్టాలు తగ్గిస్తామని పేర్కొంది. 2030 నాటికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి తగిన ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు చెప్పింది. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా విద్యుత్ వాహనాలు ప్రోత్సహిస్తూ ఇప్పుడున్న 450 విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లకు తోడు మరో 100 స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
ప్రజలకు చార్జింగ్ సౌకర్యాలు అందుబాటులోనికి తెచ్చేందుకు టీజీ ఈవీ(TG-EV) మొబైల్ యాప్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తూ నూతన ఎనర్జీ పాలసీని తెస్తామని, ఇందులో సౌరశక్తి రంగానికి ప్రాధాన్యతనిస్తామన్నారు. ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింట్ స్టేషన్‌లపై దృష్టిపెట్టిన ప్రభుత్వం, నూతన విద్యుత్ విధానం తెస్తూ సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించింది.
"రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయకట్టు విస్తీర్ణం పెంచాలని సంకల్పించింది. ఇందుకోసం ఈ బడ్జెట్‌లో సాగునీటి పారుదల రంగానికి రూ. 22,301 కోట్లు కేటాయించాము". - భట్టి విక్రమార్క, ఆర్ధికమంత్రి.
హైదరాబాద్‌పై స్పెషల్ నజర్ - ఏకంగా రూ.10వేల కోట్ల కేటాయింపులు - HYDERABAD DEVELOPMENT BUDGET 2024
బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి పెద్దపీట - రూ.72,659 కోట్లు కేటాయింపు - telangana budget 2024 highlights