ETV Bharat / state

మూడేళ్లకు ఎల్‌ఆర్‌'ఎస్‌' - సర్కారు నిర్ణయంతో హెచ్​ఎండీఏకు రూ.1000, జీహెచ్​ఎంసీకి రూ.450 కోట్లు - Congress Govt Decision LRS

Telangana Government to Regularize LRS Application : ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తుదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వెంటనే దరఖాస్తులన్నింటినీ పరిశీలించి తగు నిర్ణయాన్ని తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఆదేశించింది. ఈ నిర్ణయంతో హెచ్​ఎండీఏకు రూ.1000 కోట్లు, జీహెచ్​ఎంసీకి రూ.450 కోట్ల మేర ఆదాయం సమకూరనుందనే అంచనాలు ఉన్నాయి.

Layout Regulation Scheme In Telangana
Telangana Government to Regularize LRS Application
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 10:40 AM IST

Telangana Government to Regularize LRS Application : హైదరాబాద్​ ఎల్​ఆర్​ఎస్​ (అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం) దరఖాస్తుదారులకు ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. సత్వరమే దరఖాస్తులన్నింటినీ పరిశీలించి, తగు నిర్ణయం తీసుకోవాలని సోమవారం ఆయా సంబంధిత శాఖలను ఆదేశించింది. హెచ్​ఎండీఏ, జీహెచ్​ఎంసీ ( GHMC) పరిధిలోని దరఖాస్తులకు ముందుకు పోయే మోక్షం లభించినట్లయింది. మూడేళ్ల నిరీక్షణకు ఇప్పుడు తెరపడనుంది. రెండు సంస్థల పరిధిలోని మొత్తం 4.5 లక్షలకు పైగా దరఖాస్తులు అందగా, వాటి ద్వారా హెచ్​ఎండీఏకు రూ.1000 కోట్లు, జీహెచ్​ఎంసీకి రూ.450 కోట్ల ఆదాయం సమకూరుతుందనే అంచనాలు ఉన్నాయి.

పెండింగ్​లో 25 లక్షల ఎల్​ఆర్​ఎస్ ​దరఖాస్తులు - కాంగ్రెస్​ సర్కార్​ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తుల పరిష్కారంపై హెచ్​ఎండీఏ (HMDA) ప్రత్యేక దృష్టి పెట్టింది. ఘట్​కేసర్​, శంషాబాద్​, శంకర్​పల్లి, మేడ్చల్​ జోన్ల పరిధిలోని దాదాపు 3.46 లక్షల ప్లాట్ల యజమానులు మూడు సంవత్సరాల కిందట క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. ఎక్కువ శాతం దరఖాస్తుల్లో ఘట్‌కేసర్‌, శంకర్‌పల్లి, శంషాబాద్‌ ప్రాంతాలవే ఉన్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే అక్కడ భూముల ధరలు కొద్ది మేర తక్కువ ఉంటాయి. అందుకే ఆదాయం రూ.1000 కోట్లు దాటకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Layout Regulation Scheme In Telangana : గతంలో 50వేల దరఖాస్తుల పరిశీలన మొదలవగా, ప్రక్రియ వేర్వేరు దశల్లో పని ఆగిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు వారందరికీ మరోమారు మేసేజ్​లు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. మార్చి నెల చివరికల్లా ఈ ప్రక్రియ పూర్తిచేయాలనే ఆదేశాల నేపథ్యంలో సంబంధిత అధికారులు అటకెక్కిన దస్త్రాలకు బూజు దులుపుతున్నారు.

land Regularization : భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల విధివిధానాల్లో మార్పులు

గ్రేటర్​ హైదరాబాద్​ పరిధి నుంచి మొత్తం 1.06 లక్షల ఎల్​ఆర్​ఎస్ దరఖాస్తులు వచ్చాయి. పరిశీలను మొదలై వేర్వేరు స్థాయిల్లో నిలిచినవి 33వేలు ఉన్నాయని స్టాటిస్టిక్స్​ చెబుతున్నాయి. మరో రెండున్నర వేల దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలుస్తోంది. 24వేల దరఖాస్తుదారులకు షార్ట్​ఫాల్ సమాచారం ఇచ్చామని, మూడు సంవత్సరాలు కావడంతో ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తులను (LRS Application) పట్టించుకోవట్లేదని యంత్రాంగం చెబుతోంది. వారి ఫోన్​ నంబర్లకు సమాచారం అందించి, అందరినీ అప్రమత్తం చేస్తామని తెలిపింది. సరైన పత్రాలతో దరఖాస్తుదారులు సంబంధిత సర్కిల్​ ఆఫీస్​లను సంప్రదించాలని ప్రణాళిక విభాగం సూచించింది. ఈ దరఖాస్తుల పరిశీలనతో బల్దియాకు రూ.450 కోట్లం ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ​

ఎల్​ఆర్​ఎస్​లపై త్వరలోనే కీలక నిర్ణయం : భట్టి విక్రమార్క

Congress Govt Decision on LRS Applications : కాగా 2020లో స్వీకరించిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంది. మార్చి 31వ తేదీలోగా దరఖాస్తుదారులకు లే-అవుట్‌ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇచ్చింది. వివాదాలు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు, దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు మినహా ఇతర లేఔట్ల ప్లాట్లకు అవకాశం కల్పించింది.

Illegal Registrations: అక్రమ రిజిస్ట్రేషన్లు.. అనధికార వసూళ్లు!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.