IPS Officers Transfers in TG 2024 : రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ జరిగింది. 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాత్కాలికంగా ట్రాన్స్ఫర్ ప్రక్రియ చేపట్టింది. ఆ తర్వాత రాష్ట్రంలో సార్వత్రిక ఎలక్షన్ కోడ్ అమలు కావడంతో బదిలీ ప్రక్రియను నిలిపివేసింది. ఎన్నికలు ముగిసినందున పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా భారీ ఎత్తున ఐపీఎస్‌లకు స్థానచలనం కల్పించింది. పలువురు అధికారుల్ని డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఇటీవల 20మంది జిల్లా కలెక్టర్లను సైతం రాష్ట్ర సర్కార్ బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
Telangana IPS Officers Transfers : అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్‌గా రుతురాజ్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్ధన్, యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా సాయి చైతన్య, సీఐడీ ఎస్పీగా విశ్వజిత్ కంపాటి, హైదరాబాద్ నార్త్‌జోన్ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. శంషాబాద్ డీసీపీగా బి.రాజేశ్, బాలానగర్ డీసీపీగా కె.సురేశ్ కుమార్, మేడ్చల్ జోన్ డీసీపీగా ఎన్.కోటిరెడ్డి, రైల్వేస్ ఎస్పీగా చందన దీప్తిని నియమించారు.
తెలంగాణ – ఐపీఎస్‌ల బదిలీ :
- జగిత్యాల జిల్లా ఎస్పీగా అశోక్ కుమార్
- సూర్యాపేట జిల్లా ఎస్పీగా సన్‌ప్రీత్ సింగ్
- హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే
- జోగులాంబ గద్వాల ఎస్పీగా టి.శ్రీనివాసరావు
- అవినీతి నిరోధకశాఖ జాయింట్ డైరెక్టర్‌గా రుతురాజ్
- కుమురంభీం అసిఫాబాద్ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు
- బాలానగర్ డీసీపీగా కె.సురేశ్ కుమార్
- మహబూబ్‌నగర్ ఎస్పీగా జానకి ధరావత్
- సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్ధన్
- సీఐడీ ఎస్పీగా విశ్వజిత్ కంపాటి
- శంషాబాద్ డీసీపీగా బి.రాజేశ్
- మేడ్చల్ జోన్ డీసీపీగా ఎన్.కోటిరెడ్డి
- వికారాబాద్ ఎస్పీగా కె.నారాయణరెడ్డి
- టీజీఎస్పీ సెకండ్ బెటాలియన్ కమాండెంట్‌గా నికితా పంత్
- నల్గొండ ఎస్పీగా శరత్ చంద్రపవార్
- రైల్వేస్ ఎస్పీగా చందన దీప్తీ
- వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమా
- యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా సాయి చైతన్య
- హైదరాబాద్ నార్త్‌జోన్ డీసీపీగా సాధనరష్మి పెరుమాళ్
- డిచ్‌పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్‌గా రోహిణి ప్రియదర్శిని
- మంచిర్యాల డీసీపీగా ఎ.భాస్కర్
- జనగామ వెస్ట్‌జోన్ డీసీపీగా బి.రాజమహేంద్ర నాయక్
Father's Day Special : ఉప్పొంగిన నాన్న గుండె - ట్రైనీ ఐఏఎస్ కుమార్తెకు ఐపీఎస్ తండ్రి సెల్యూట్