ETV Bharat / state

కౌంట్ డౌన్ స్టార్ట్ - మరో ఐదురోజుల్లో రూ.2 లక్షల రుణమాఫీ - TELANGANA LOAN WAIVER THIRD PHASE

Third Term Runa Mafi In Telangana : మూడోదఫా రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే లక్షన్నర వరకు ఉన్న రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం ఈ నెల 15న రెండు లక్షలలోపు ఉన్న అప్పులన్నింటిని మాఫీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. రూ.8,000 కోట్లకు పైగా నిధులు ఇప్పటికే అందుబాటులో ఉంచినట్లు సమాచారం.

Congress Focus on Third Term Runa Mafi in Telangana
Third Term Runa Mafi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 10, 2024, 7:08 AM IST

Updated : Aug 10, 2024, 7:16 AM IST

Rs.2 Lakhs Loan Waiver in Telangana : ఎన్నికల్లో ఇచ్చిన రెండులక్షలలోపు రైతు రుణాల మాఫీ ప్రక్రియను ఈనెల 15లోగా పూర్తి చేయాలని కాంగ్రెస్‌ సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకొంది. ఈనెల 15లోపు ఆ ప్రక్రియ పూర్తిచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గంలో రుణమాఫీకి ఆమోదముద్ర వేయడం సహా ఉత్తర్వులు జారీచేశారు. తొలుత లక్షలోపు ఉన్న అప్పును ఆ తర్వాత లక్షన్నరలోపు ఉన్న రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేసింది.

ఆ రైతులకు చెందిన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఇప్పటివరకు రెండు విడతల్లో 16 లక్షల 29 వేల కర్షక కుటుంబాలు రుణమాఫీ కింద ప్రయోజనం పొందాయి. లక్షన్నర వరకు రైతు రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో రూ. 12వేల 298 కోట్లు జమచేశారు. ఖమ్మం జిల్లా వైరా వేదికగా నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మూడోవిడత రుణమాఫీ కోసం వ్యవసాయ, ఆర్థిక శాఖలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి.

ఎనిమిది కోట్లకుపైగా రుణమాఫీకి సిద్ధం : రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేశాయి. అందుకు కావాల్సిన నిధులను ఇప్పటికే అందుబాటులో ఉంచినట్లు సమాచారం. మొదటి, రెండు విడతల్లో రూ.12 వేల కోట్లకు పైగా మాఫీచేయగా ఈసారి రూ. 8,000 కోట్లకు పైగా రుణమాఫీ కోసం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఎఫ్​ఆర్​బీఎం పరిమితికి లోబడి తీసుకునే రుణాలు సహా ఇతరత్రా మార్గాల ద్వారా ఆ నిధులు సమకూరుస్తున్నట్లు సమాచారం.

బాండ్ల విక్రయం ద్వారా గత వారం రూ. 3 వేల కోట్లు సమకూర్చుకున్న ప్రభుత్వం, ఈవారం మరో రూ.3 వేల కోట్లు అదే తరహాలో సమీకరించుకోనుంది. ఈమేరకు ఆర్థికశాఖ రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేసింది. వెయ్యికోట్ల విలువైన బాండ్లను 11, 14, 21 సంవత్సరాల కాలానికి విడుదల చేశారు. మంగళవారం ఆ బాండ్లను వేలం వేస్తారు. వేలం అనంతరం రూ. 3 వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు సమకూరుతుంది. రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న వారు మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు కొంత గడువు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

'ఆగస్టు 15లోపు రెండులక్షలలోపు రుణాలకు సంబంధించి ఖమ్మం జిల్లా వైరా వేదికగా నిర్వహించే భారీ బహిరంగ సభలో రైతులకు రుణ విముక్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, మంత్రులు పాల్గొంటారు' - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి

రూ.2 లక్షల రుణమాఫీకి రేవంత్​ సర్కార్ గ్రీన్​ సిగ్నల్​​ - ఎవరెవరు అర్హులో మీకు తెలుసా? - TG Cabinet Approval Runamafi

Last Updated : Aug 10, 2024, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.