ETV Bharat / state

2025 సెలవుల లిస్ట్​ వచ్చేసిందోచ్​ - ఆ నెలలో ఎక్కువ హాలిడేస్ - PUBLIC HOLIDAYS IN 2025

2025 సంవత్సరంలో సెలవులు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం - జీవో జారీ చేసిన కాంగ్రెస్ సర్కార్

Public Holidays in 2025
2025 Holidays List (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2024, 3:33 PM IST

Updated : Nov 9, 2024, 8:24 PM IST

Telangana Govt Confirmed 2025 Holidays : 2025 ఏడాదికి గాను సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 2025లో మొత్తంగా 27 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక హాలిడేస్ ఉన్నట్లు రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్​ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 1న సాధారణ సెలవు ప్రకటించినందున, ఫిబ్రవరిలో రెండో శనివారం పనిరోజుగా ఉంటుందని జీవోలో సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. మొత్తం 23 ఐచ్ఛిక సెలవుల్లో ఉద్యోగులు గరిష్ఠంగా ఐదు తీసుకోవచ్చునని చెప్పారు.

General Holidays 2025 List
General Holidays 2025 List (ETV Bharat)

అకడమిక్ క్యాలెండర్ సెలవుల జాబితా : జనవరి 1, భోగీ, సంక్రాంతి, గణతంత్ర దినం, మహాశివరాత్రి, హోలీ, ఉగాది, రంజాన్, బాబూ జగజ్జీవన్ రాం, శ్రీరామనవమి, అంబేడ్కర్ జయంతి, గుడ్ ఫ్రైడే, బక్రీద్, మొహరం, బోనాలు, స్వాతంత్య్ర దినం, శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ, బతుకమ్మ, గాంధీ జయంతి, దసరా, దీపావళి, కార్తీక పౌర్ణమి, క్రిస్​మస్​ను సాధారణ సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది. రంజాన్, మొహరం, మిలాద్ ఉన్ నబీ పండుగలకు నెలవంక కనిపించిన రోజు ప్రకారం సెలవు రోజు మారితే మీడియా ద్వారా సమాచారం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ పరిశ్రమలు, విద్యా సంస్థల్లోని ఉద్యోగులకు సెలవులు ఆయా శాఖలు ప్రత్యేకంగా వెల్లడిస్తాయని జీవోలో తెలిపారు. వచ్చే ఏడాది మొత్తంగా చూసుకంటే జనరల్​ హాలిడేస్​, ఆప్షనల్​ సెలవుల్లో ఎక్కువగా జనవరి నెలలోనే సెలవులు మంజూరు అయ్యాయి.

Optional Holidays 2025 List
Optional Holidays 2025 List (ETV Bharat)

ఇందులో ఆప్షనల్​ సెలవుల్లో డ్యూటీ చేయటం, చేయకపోవటం అది ఉద్యోగుల ఇష్టమే. కాగా గవర్నమెంట్ హాలిడేస్​ లిస్ట్ ముందుగా రిలీజ్ చెయ్యడంపై ఎంప్లాయిస్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీని ఆధారంగా ఉద్యోగులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇప్పటి నుంచే సెలవులకు టూర్లు ప్లాన్ చేసుకోవటానికి వీలు ఏర్పడింది. ఇటీవల రైల్వే శాఖ కూడా 90 రోజుల ముందు నుంచి టికెట్ల బుకింగ్‌ చేసుకునేలా ముందున్న సదుపాయాన్ని కుదించింది. ఈ క్రమంలో సెలవుల ఆధారంగా, టూర్ ప్లాన్ చేసుకొని, టికెట్లు బుక్ చేసుకోవటానికి మంచి అవకాశం లభించింది. అందువల్ల తెలంగాణ సర్కార్​ తాజా జీవోపై ప్రధానంగా ఉద్యోగుల నుంచి హర్షం వ్యక్తంమవుతోంది.

గుడ్​న్యూస్ - ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచిన సర్కార్

రాష్ట్రంలో మరో టూరిస్ట్​ స్పాట్ - స్పీడ్‌ బోట్లతో రయ్​ రయ్​ మంటూ సరికొత్త జల పర్యాటకం

Last Updated : Nov 9, 2024, 8:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.